రామోజీ, జగన్ ఏకాంత చర్చలు!

ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమావేశం అయ్యారు. హైదరాబాద్ శివారులోని ఫిలింసిటీలో రామోజీ రావుతో జగన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీకి జగన్ తోపాటు తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కూడా హాజరయ్యారు. అయితే వీరిద్దరి సమావేశం మర్యాద పూర్వకంగానే జరిగిందని వైసీపీ వర్గాలు తెలిపాయి. అయితే వీరిద్దరి భేటీ వెనుక ఇతర కారణాలు కూడా ఉన్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి ఇదివరకు […]

Advertisement
Update: 2015-09-24 09:25 GMT

ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమావేశం అయ్యారు. హైదరాబాద్ శివారులోని ఫిలింసిటీలో రామోజీ రావుతో జగన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీకి జగన్ తోపాటు తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కూడా హాజరయ్యారు. అయితే వీరిద్దరి సమావేశం మర్యాద పూర్వకంగానే జరిగిందని వైసీపీ వర్గాలు తెలిపాయి. అయితే వీరిద్దరి భేటీ వెనుక ఇతర కారణాలు కూడా ఉన్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది.

నిజానికి ఇదివరకు కూడా జగన్, రామోజీ కలిసిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. అయితే ఆ భేటీలు ఏదో ఇతరుల ఫంక్షన్ లో కాకతాళీయంగా జరిగినవే. ఇటీవల మైహోమ్ సంస్థల అధినేత రామేశ్వరరావు 60ఏళ్ల షష్టిపూర్తి మహోత్సవానికి జగన్ తోపాటు రామోజీ కూడా హాజరయ్యారు. అంతకుముందు మంచు మనోజ్ పెళ్లివేడుకకు కూడా ఇద్దరూ హాజరయ్యారు. ఆ సందర్భంగా వాళ్ళు మాట్లాడుకున్నారు. అ విషయం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

వైఎస్ హయాం నుంచి ఆయన మరణించిన తర్వాత కూడా ఈనాడు, సాక్షి పత్రిక మధ్య వార్తల యుద్ధం నడిచింది. జగన్ పై ఈనాడు, రామోజీపై సాక్షి వ్యక్తిగతంగానూ వార్తలు రాసి విమర్శించుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ జగన్ ఏకంగా జగన్ రామోజీని ఫిలింసీటీకి వెళ్లి కలవడం రాజకీయ వర్గాలతోపాటు జర్నలిస్టు వర్గాల్లోనూ ఆసక్తిని రేపుతోంది.

Tags:    
Advertisement

Similar News