10 లోగా ప్రత్యేక హోదా రాకుంటే బంద్‌ల బాట: రామకృష్ణ

ఆంధ్రప్రదేశ్‌ సీపీఐ ఉద్యమబాట పట్టింది. రాష్ర్టానికి ప్రత్యేక హోదా…ఉత్తరాంధ్ర, రాయాలసీమలకు ప్రత్యేక ప్యాకేజీల కోసం జిల్లాలో బస్సుయాత్రను ప్రారంభించింది. ఈనెల 11 వరకు 13 జిల్లాలో బస్సు యాత్ర కొనసాగుతుందని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. కేంద్రప్రభుత్వం దిగిరాగకపోతే రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తామన్నారు. ఇప్పటికైనా టీడీపీ, కేంద్రమంత్రులు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సినీనటుడు శివాజీ, ఏపీ మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ పాల్గొన్నారు. ఆగస్టు 10 లోగా ఏపీకి […]

Advertisement
Update: 2015-08-02 00:39 GMT
ఆంధ్రప్రదేశ్‌ సీపీఐ ఉద్యమబాట పట్టింది. రాష్ర్టానికి ప్రత్యేక హోదా…ఉత్తరాంధ్ర, రాయాలసీమలకు ప్రత్యేక ప్యాకేజీల కోసం జిల్లాలో బస్సుయాత్రను ప్రారంభించింది. ఈనెల 11 వరకు 13 జిల్లాలో బస్సు యాత్ర కొనసాగుతుందని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. కేంద్రప్రభుత్వం దిగిరాగకపోతే రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తామన్నారు. ఇప్పటికైనా టీడీపీ, కేంద్రమంత్రులు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సినీనటుడు శివాజీ, ఏపీ మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ పాల్గొన్నారు. ఆగస్టు 10 లోగా ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటన చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలో ప్రారంభమైన బస్సు యాత్ర తొలిరోజు ఉత్సాహంగా సాగింది. విజయనగరం చేరిన తర్వాత విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 10 లోగా ఏపీకి ప్రత్యేకహోదా ప్రకటన చేయాలని, లేదంటే 11వ తేదీ నుంచి ఉద్యమ తీవ్రత చూపిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హెచ్చరించారు.
Tags:    
Advertisement

Similar News