రాష్ర్టపతికి గవర్నర్ విందు... బాబు హాజరు... కేసీఆర్ గైర్హాజరు

రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ గౌరవార్థం గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఇచ్చిన విందుకు తెలుగు రాష్ట్రాల సీఎంల్లో ఒకరు హాజరుకాగా మరొకరు గైర్హాజరయ్యారు. తెలంగాణ సీఎంకు 101 డిగ్రీల జ్వరం ఉందని, అందువల్లే ఆయన విందుకు హాజరుకాలేకపోతున్నారని సీఎంవో వర్గాలు తెలిపాయి. జర్వం వల్ల అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకున్నారని, వైద్యుల సూచన మేరకు ఇంట్లో పూర్తిగా విశ్రాంతి తీసుకొంటున్నారని, సందర్శకులను సైతం అనుమతించడం లేదని వెల్లడించాయి. అయితే, ఓటుకు నోటు, ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారాల్లో ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రులు […]

Advertisement
Update: 2015-06-30 23:28 GMT
రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ గౌరవార్థం గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఇచ్చిన విందుకు తెలుగు రాష్ట్రాల సీఎంల్లో ఒకరు హాజరుకాగా మరొకరు గైర్హాజరయ్యారు. తెలంగాణ సీఎంకు 101 డిగ్రీల జ్వరం ఉందని, అందువల్లే ఆయన విందుకు హాజరుకాలేకపోతున్నారని సీఎంవో వర్గాలు తెలిపాయి. జర్వం వల్ల అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకున్నారని, వైద్యుల సూచన మేరకు ఇంట్లో పూర్తిగా విశ్రాంతి తీసుకొంటున్నారని, సందర్శకులను సైతం అనుమతించడం లేదని వెల్లడించాయి. అయితే, ఓటుకు నోటు, ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారాల్లో ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రులు పోటాపోటీగా విమర్శలు చేసుకొని ఉండటం, ఎమ్మెల్యేకు ముడుపుల కేసులో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి బెయిల్‌ రావడం.. వంటి పరిణామాల నేపథ్యంలో.. . చంద్రబాబు విందుకు హాజరవడం, కేసీఆర్ దూరంగా ఉండడం చర్చనీయాంశమైంది. కాగా, విందు సమయంలో చంద్రబాబుకు గవర్నర్‌ దంపతులు సాదరంగా స్వాగతం పలికారు. అయితే, తెలంగాణ ప్రజాప్రతినిధులు.. చంద్రబాబుతో అంటీముట్టనట్లు ఉన్నారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చంద్రబాబుకు దూరంగా పోయి, స్పీకర్‌ మధుసూదనాచారి వద్ద కూర్చున్నారు. విందుకు ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దిలీప్‌ బీ భోసాలేతోపాటు ఇరు రాష్ర్టాల ఉప సీఎంలు, శాసనమండళ్ల చైర్మన్లు, సీఎస్‌లు తదితరులు హాజరయ్యారు. విందుకు ముందు గవర్నర్ నరసింహన్‌, రాష్ట్రపతితో భేటీ అయ్యారు. అంతకుముందు రాష్ట్రపతి నిలయంలో బసచేసిన రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని చంద్రబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. సుమారు అరగంటపాటు ఏకాంతంగా భేటీ అయ్యారు.
Advertisement

Similar News