కీలకాంశాలపై జగన్ స్పందించరెందుకు ?

కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగినపుడు కావచ్చు, లేదా ఆంధ్రప్రదేశ్ లో శేషాచలం అడవుల్లో భారీ ఎత్తున మారణ‌కాండ సంభ‌వించి నప్పుడు కావచ్చు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించరు ? అనేది ఇపుడు ఆయన అభిమానులనూ, విమర్శ‌కులనూ తొలుస్తున్న ప్రశ్న. సాహసం, తెగువ, డైనమిజం ఉన్న నాయకుడు జగన్ అనడంలో ఎలాంటి సేందేహంలేదు. కానీ కీలకమైన ప్రజా సమస్యలపై ఆయన మౌనం దాల్చడం పలు అనుమానాలను రేెకెత్తిస్తోంది. ప్రతిపక్ష నాయకుడనే వాడు […]

Advertisement
Update: 2015-04-08 06:51 GMT

కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగినపుడు కావచ్చు, లేదా ఆంధ్రప్రదేశ్ లో శేషాచలం అడవుల్లో భారీ ఎత్తున మారణ‌కాండ సంభ‌వించి నప్పుడు కావచ్చు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించరు ? అనేది ఇపుడు ఆయన అభిమానులనూ,
విమర్శ‌కులనూ తొలుస్తున్న ప్రశ్న. సాహసం, తెగువ, డైనమిజం ఉన్న నాయకుడు జగన్ అనడంలో ఎలాంటి సేందేహంలేదు. కానీ కీలకమైన ప్రజా సమస్యలపై ఆయన మౌనం దాల్చడం పలు అనుమానాలను రేెకెత్తిస్తోంది. ప్రతిపక్ష నాయకుడనే వాడు రాష్ట్రంలో చీమ
చిటుక్కుమన్నా వెంట‌నే ఒక అభిప్రాయాన్ని ఏర్పరుచుకొని ప్రజల తరపున ముందుగా తన
వాణిని వినిపించాలి. కానీ ఇక్కడ అలా జరగడంలేదు. కేంద్ర బడ్జెట్ పై తను మాట్లాడకుండా పార్టీ నేత సోమయాజులు చేత మాట్లాడించడం ఏమిటి? తను మౌనంగా ఉండటం చూస్తే జగన్ అభిమానులు నిరాశలో పడిపోతున్నారు. ఇక శేషాచలం అడవుల్లో 20 మందిని పోలీసులు హతమార్చిన సంఘటన పై జగన్ ప్రతిపక్ష నేతగా అది జరిగిన కొద్ది గంటల్లోనే సర్కార్ పై నిప్పులు కురిపించి ఉండాలి. కానీ అది జరగలేదు. వాసిరెడ్డి పద్మ‌ చేత మాట్లాడించి సరిపెట్టుకున్నారు. ఆమె మాట్లాడిన దానికి మీడియాలో అంత ప్రాధాన్యత కూడా లభించ‌లేదు. ప్రభుత్వాన్ని నిలదీసి, ప్రశ్నించే అవకాశాలను జగన్ చేజేతులా ఎందుకు వదులుకుంటున్నారనేది మిలియన్ డాలర్ల‌ ప్రశ్న. అనుభవ రాహిత్యంతో జగన్ తన బాధ్యతను నిర్వర్తించడంలో ఆలసత్వం ప్రదర్శిస్తున్నాడనుకున్నా ఆయన చుటూ ఉన్న మేధావి గణం ఆయనకు పనికొచ్చే సలహాలు
ఎందుకివ్వడం లేదనేది మరో ప్రశ్న. కాంగ్రెస్ నాయకుడు రఘువీరా రెడ్డి స్పందన చూశాకైన జగన్ స్పందించి ఉండాల్సింది.

Tags:    
Advertisement

Similar News