TSPSC పేపర్ లీక్ కేసు... నేటి సిట్ విచారణకు బండి సంజయ్ వెళ్ళడట!

ఇప్పటికే రేవంత్ రెడ్డి సిట్ విచారణకు హాజరుకాగా, బండి సంజయ్ మాత్రం మొదట సిట్ నోటీసులు తనకు అందలేదని మరో తేదీ ఇస్తే హాజరవుతానని చెప్పారు. దాంతో ఈ రోజు సిట్ అధికారుల ముందు హాజరుకావాలంటూ మరో సారి నోటీసులు ఇచ్చింది.

Advertisement
Update: 2023-03-26 02:43 GMT

TSPSC పేపర్ లీక్ కేసును పూర్తిగా ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ కేసులో ఇప్పటికే 12 మందిని అరెస్టు చేసిన సిట్ నిన్న మరో నలుగురిపై కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంలో ఆధారాలు తెలిసిన వాళ్ళు తమకు ఆ ఆధారాలను సమర్పించాల్సిందిగా సిట్ నోటీసులు ఇస్తున్నది. అందులో భాగంగానే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లకు నోటీసులుజారీ చేసింది.

ఇప్పటికే రేవంత్ రెడ్డి సిట్ విచారణకు హాజరుకాగా, బండి సంజయ్ మాత్రం మొదట సిట్ నోటీసులు తనకు అందలేదని మరో తేదీ ఇస్తే హాజరవుతానని చెప్పారు. దాంతో ఈ రోజు సిట్ అధికారుల ముందు హాజరుకావాలంటూ మరో సారి నోటీసులు ఇచ్చింది. 

అయితే, ఈ రోజు సిట్ విచారణకు బండి సంజయ్ హాజరుకావడంలేదు. ఆయన తరపున బీజేపీ లీగల్ టీమ్ సిట్ ముందుకు రానుంది. ఈ రోజు బండి సంజయ్ కర్నాటక ఎన్నికల ప్రచార సభలో పాల్గొనాల్సి ఉన్నందున సిట్ ముందు స్వయంగా హాజరు కావడం కుదరదని సంజయ్ తెలిపారు.

కాగా, బీజేపీ లీగల్ టీం చెప్పే విషయాలతో 'సిట్' సంత్రుప్తి చెందుతుందా లేక బండి సంజయ్ ని మరో సారి విచారణకు పిలుస్తు‍ందా అనేది వేచి చూడాలి. 

Tags:    
Advertisement

Similar News