తెలంగాణ అనేక ప్రజాపోరాటాలు చేసిన నేల,బీజేపీ పై పోరాటాన్ని ఇక్కడి నుంచే మొదలుపెడదాం-పినరయి విజయన్

''బీజేపీ దేశాన్ని మత ప్రాతిపదికన విభజిస్తోంది. న్యాయ వ్యవస్థతో సహా అన్ని వ్యవస్థలను నాశనం చేస్తోంది. దేశం రాజ్యాంగ సంక్షోభంలో పడింది. ఈ పరిస్థితిలో బీఆరెస్ బీజేపీ వ్యతిరేక పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు అభినందిస్తున్నాను''అని పినరయి విజయన్ అన్నారు.

Advertisement
Update: 2023-01-18 10:42 GMT

విభజన రాజకీయాలతో దేశాన్ని విచ్చిన్నం చేస్తున్న బీజేపీ పై పోరాటానికి భావస్వారూప్యత కలిగిన పార్టీలన్నీ ఒకే వేదిక మీదికి రావడం గొప్ప విషయమని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. ఖమ్మంలో జరిగిన భారత్ రాష్ట్ర సమితి బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఈరోజు దేశం ప్రత్యేక పరిస్థితుల్లో ఉందని, అన్ని పార్టీలు ఏకమై దేశాన్ని కాపాడుకోవాలని అన్నారు.

''బీజేపీ దేశాన్ని మత ప్రాతిపదికన విభజిస్తోంది. న్యాయ వ్యవస్థతో సహా అన్ని వ్యవస్థలను నాశనం చేస్తోంది. దేశం రాజ్యాంగ సంక్షోభంలో పడింది. ఈ పరిస్థితిలో బీఆరెస్ బీజేపీ వ్యతిరేక పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు అభినందిస్తున్నాను''అని పినరయి విజయన్ అన్నారు. బీఆరెస్ కు తమ పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తుందని ఆయన‌ అన్నారు. 

''పెట్రొలియం ధరలు పెరిగిపోయి సామాన్యుడి నడ్డి విరగ్గొడుతున్నాయి. రాష్ట్రాల సమ్మేళనమే దేశం. అలాంటి ఫెడరల్ సంస్కృతిని కేంద్రం దెబ్బ తీస్తోంది. సంస్కరణల పేరుతో కెంద్రం అనైతిక చర్యలకు పాల్పడుతోంది.'' అని ఆరోపించారు విజయన్.

భావస్వారూప్యతకలిగిన పార్టీలతో బీఆరెస్ కలిసి రావడం గొప్ప ముందడుగు అని విజయన్ అన్నారు. దేశాన్ని బీజేపీ, ఆరెస్సెస్ కలిసి పాలిస్తున్నాయని, గవర్నర్నర్ల వ్యవస్థను బీజేపీ తన రాజకీయ ప్రయోజనాలకోసం ఉపయోగించుకుంటుందని ఆయన మండి పడ్డారు. తెలంగాణ అనేక ప్రజాపోరాటాలు చేసిన నేల అని,బీజేపీ పై పోరాటాన్ని ఇక్కడి నుంచే మొదలుపెడదాంఅని పినరయి విజయన్ అన్నారు.

Tags:    
Advertisement

Similar News