ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసు: హైకోర్టులో బీజేపీకి మళ్ళీ ఎదురుదెబ్బ‌

ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసులో బీఎల్ సంతోష్ కు నోటీసులు ఇవ్వడానికి ఆయన అందుబాటులో లేడని తెలంగాణ పోలీసులు హైకోర్టుకు నివేదించగా ఆయనకు వాట్స‌ప్ ద్వారా కానీ, ఈ మెయిల్ ద్వారా కానీ నోటీసులు పంపాలని హైకోర్టు ఆదేశించింది.

Advertisement
Update: 2022-11-23 11:30 GMT

టీఆరెస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నం చేసిన కేసులో బీజేపీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ముందుగా బేరసారాలు చేస్తూ అడ్డంగా బుక్కైన ముగ్గురు నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజీలు అరెస్టు కాకుండా ఆ పార్టీ ప్రయత్నించింది. అది సాధ్యం కాకపోవడంతో కేసును సీబీకి అప్పజెప్పాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దాంట్లో కూడా ఫెయిల్ అయిన తర్వాత బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసులు జారీ చేయకుండా అడ్డుకునే ప్ర‌యత్నం చేసింది. అయినప్పటికీ సిట్ ఆయనకు నోటీసులు పంపించడం, ఆయన విచారణకు హాజరుకాకపోవడం జరిగాయి. ఈ నేపథ్యంలో బీజేపీ మళ్ళీ బీఎల్ సంతోష్ కు నోటీసులు పంపకుండా అడ్డుకునేందుకు ఈ రోజు హైకోర్టులో ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నాన్ని కూడా ఈ రోజు హైకోర్టు తిప్పికొట్టింది.

బీఎల్ సంతోష్ కు నోటీసులు ఇవ్వడానికి ఆయన  అందుబాటులో లేడని తెలంగాణ పోలీసులు హైకోర్టుకు నివేదించగా ఆయనకు వాట్స‌ప్ ద్వారా కానీ, ఈ మెయిల్ ద్వారా కానీ నోటీసులు పంపాలని హైకోర్టు ఆదేశించింది.

దీనికి ముందు బీజేపీ తరపున వాదించిన సీనియర్ అడ్వకేట్ మహేష్ జఠ్మలానీ, సంతోష్ గుజరాత్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారని తెలిపారు.

ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, సంతోష్ నోటీసులు స్వీకరించడం లేదని, విచారణకు సహకరించడం లేదని కాబట్టి ఆయనను అరెస్టు చేయవద్దంటూ హైకోర్టు గతంలో ఇచ్చిన స్టేను ఎత్తివేయాలని కోరారు. ఈ మొత్తం వ్యవహారంపై ఈ నెల 29న పూర్తి నివేదిక సమర్పించాలని సుప్రీం కోర్టు ఛీఫ్ జస్టిస్ ఆదేశించారని, సంతోష్ మాత్రం విచారణకు సహకరించడం లేదని అందువల్ల తదుపరి చర్యలకు ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. దాంతో కోర్టు, సంతోష్ కు, వాట్సప్, ఈ మెయిల్ ద్వారా నోటీసులు పంపాలని ఆదేశిస్తూ కేసును ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది.

Tags:    
Advertisement

Similar News