పవన్ కల్యాణ్ సినిమాలో నన్ను విలన్‌గా నటించమని అడిగారు : మంత్రి మల్లారెడ్డి

హరీశ్ శంకర్ ఇంటికి వచ్చి గంటర్నర బతిమిలాడారు. విలన్‌గా నటిస్తే బాగుంటుందని అన్నాడు. కానీ తాను మాత్రం ఒప్పుకోలేదని మల్లారెడ్డి చెప్పారు.

Advertisement
Update: 2023-03-26 08:14 GMT

పవన్ కల్యాణ్ సినిమాలో తనను విలన్‌గా నటించమని డైరెక్టర్ హరీశ్ శంకర్ కోరారని.. అయితే ఆ రిక్వెస్ట్‌ను తాను తిరస్కరించినట్లు మంత్రి మల్లారెడ్డి చెప్పారు. సుమంత్ ప్రభాస్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'మేమ్ ఫేమస్' సినిమా టీజర్ కార్యక్రమం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. హరీశ్ శంకర్ ఇంటికి వచ్చి గంటర్నర బతిమిలాడారు. విలన్‌గా నటిస్తే బాగుంటుందని అన్నాడు. కానీ తాను మాత్రం ఒప్పుకోలేదని మల్లారెడ్డి చెప్పారు.

ప్రపంచంలో అత్యధిక మంది యువత ఉన్న దేశం ఇండియానే. అందులో తెలంగాణలో 65 శాతం మంది యువతే ఉన్నారు. వీళ్లందరూ చాలా ఫేమస్ కావాలని అనుకుంటారు.  బీర్లు తాగితే, సిగరెట్లు కాలిస్తే, షికార్లు కొడితే, అమ్మాయిల వెంట తిరిగితే ఫేమస్ అయిపోతామని భావిస్తారు. ఇలాంటివి చేస్తే అసలు ఫేమస్ కారు. అందరూ కష్టపడితేనే ఫేమస్ అవుతారని మల్లారెడ్డి చెప్పారు. తనకు 23 ఏళ్లకే పెళ్లి అయ్యింది. అప్పుడు నా దగ్గర ఒక సైకిల్, రెండు పాల క్యాన్లు మాత్రమే ఉన్నాయి. కానీ ఇవ్వాళ ఎన్నో కాలేజీలు పెట్టిన.. కేసీఆర్ దయతో క్యాబినెట్ మినిస్టర్ అయిన.. ఇదంతా కష్టపడితేనే వచ్చిందని మల్లారెడ్డి చెప్పారు.

తాను కష్టపడి పాలమ్మిన.. పూలమ్మిన.. కాలేజీలు పెట్టిన.. టాప్ డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులను తయారు చేసిన.. అలా ఫేమస్ అయిన. యువత కూడా కష్టపడితే తప్పకుండా విజయం సాధిస్తారని అన్నారు. మన మంత్రి కేటీఆర్‌ను చూడండి. చిన్న వయసులోనే ప్రపంచం మెచ్చుకునే మినిస్టర్ అయ్యిండు. ఆయన ఎంతో కష్టపడితేనే ఈ స్థాయికి వచ్చాడని మంత్రి చెప్పారు.

ఈ సినిమా హిట్ అయితే సుమంత్ ప్రభాస్‌తో నేను ఒక సినిమా తీస్తా అని మల్లారెడ్డి చెప్పారు. ఒకప్పుడు తెలంగాణ సినిమా అంటే చిన్న చూపు ఉండేది. కానీ ఇప్పుడు తెలంగాణ సినిమా దూసుకొని పోతున్నదని మల్లారెడ్డి చెప్పారు. ఎన్నికలు అయి పోయిన తర్వాత ఏడాదికి ఒక సినిమా చొప్పున వరుసగా సిన్మాలు నిర్మిస్తానని మల్లారెడ్డి వెల్లడించారు. ఈ సినిమా టీజర్ నాకు చాలా బాగా నచ్చింది. తప్పకుండా మూవీ సక్సెస్ అవుతుందని మంత్రి మల్లారెడ్డి టీమ్‌ను అభినందించారు.

Tags:    
Advertisement

Similar News