ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు

నిన్న శ్రీరామనవమి సందర్భంగా రాజాసింగ్ అద్వర్యంలో జరిగిన శోభాయాత్రలో మహాత్మా గాంధీ హంతకుడు నాథూరాం గాడ్సే ఫోటోలను ప్రదర్శించడమే కాక ముస్లింలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు రాజాసింగ్. తన‌ కొడుకును పరిచయం చేస్తూ ముస్లింల‌పై రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Advertisement
Update: 2023-04-01 09:16 GMT

వివాదాస్పద ఎమ్మెల్యే రాజాసింగ్ పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఇతర మతాలపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని, రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు చేయవద్దంటూ స్వయంగా హైకోర్టు ఆయనకు ఆదేశాలిచ్చినప్పటికీ ఆయన తీరు మాత్రం మారడం లేదు. పదే పదే ఇతర మతస్తులను రెచ్చగొడుతూనే ఉన్నారు. హైదరాబాద్ లోనే కాదు ఆయన వేరే రాష్ట్రాలకు వెళ్ళినా ఆయనది అదే తీరు. ఆయనపై ముంబైలో కూడా కేసు నమోదయ్యింది.

నిన్న శ్రీరామనవమి సందర్భంగా రాజాసింగ్ అద్వర్యంలో జరిగిన శోభాయాత్రలో మహాత్మా గాంధీ హంతకుడు నాథూరాం గాడ్సే ఫోటోలను ప్రదర్శించడమే కాక ముస్లింలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు రాజాసింగ్. తన‌ కొడుకును పరిచయం చేస్తూ ముస్లింల‌పై రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై పలువురు ఫిర్యాదు చేయగా అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

కాగా జనవరి 29న ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజాసింగ్ ముస్లిం లను రెచ్చగోట్టేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన‌ క్రమంలో ముంబై పోలీసులు రాజాసింగ్ పై FIR నమోదు చేశారు. ముంబైలో రాజాసింగ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనకు హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. అయితే తెలంగాణ హైకోర్టు బెయిల్ ఇచ్చే సమయంలో రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయొద్దని చెప్పిన విషయాన్ని పోలీసులు ఈ నోటీసుల్లో గుర్తు చేశారు. 

Tags:    
Advertisement

Similar News