Lava Blaze Curve 5G | ఆక‌ర్ష‌ణీయ ఫీచ‌ర్ల‌తో లావా బ్లేజ్ క‌ర్వ్ 5జీ.. ధ‌రెంతంటే..?!

Lava Blaze Curve 5G | ప్ర‌ముఖ స్మార్ట్‌ఫోన్ల త‌యారీ సంస్థ లావా ఇంట‌ర్నేష‌న‌ల్ (Lava International) త‌న లావా బ్లేజ్ కర్వ్ 5జీ (Lava Blaze Curve 5G) ఫోన్‌ను భార‌త్ మార్కెట్లో ఆవిష్క‌రించింది.

Advertisement
Update: 2024-03-05 11:17 GMT

Lava Blaze Curve 5G | ప్ర‌ముఖ స్మార్ట్‌ఫోన్ల త‌యారీ సంస్థ లావా ఇంట‌ర్నేష‌న‌ల్ (Lava International) త‌న లావా బ్లేజ్ కర్వ్ 5జీ (Lava Blaze Curve 5G) ఫోన్‌ను భార‌త్ మార్కెట్లో ఆవిష్క‌రించింది. రెండు క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో ల‌భించే ఈ ఫోన్ ఓక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ఎస్వోసీ (Octa-core MediaTek Dimensity 7050 SoC) చిప్ సెట్‌తో ప‌ని చేస్తుంది. లావా బ్లేజ్ క‌ర్వ్ 5జీ (Lava Blaze Curve 5G) ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల 3డీ క‌ర్వ్‌డ్ డిస్‌ప్లే క‌లిగింది. 64- మెగా పిక్సెల్ సెన్స‌ర్ ట్రిపుల్ రేర్ కెమెరా సెట‌ప్ క‌లిగి ఉంటుంది. డోల్బీ ఆట్మోస్ ప‌వ‌ర్డ్ స్టీరియో స్పీక‌ర్లు, 33వాట్ల చార్జింగ్ మ‌ద్ద‌తుతో 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీతో వ‌స్తుంది.

లావా బ్లేజ్ కర్వ్ 5జీ (Lava Blaze Curve 5G) ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.17,999, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.18,999ల‌కు ల‌భిస్తాయి. ఐర‌న్ గ్లాస్‌, గ్లాస్ వృద్దియాన్ రంగు ఆప్ష‌న్ల‌లో అందుబాటులో ఉంటాయి. ఈ-కామ‌ర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌, లావా ఈ-స్టోర్‌, ఇత‌ర రిటైల్ స్టోర్ల‌లో ఈ నెల 11 మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి విక్ర‌యాలు ప్రారంభం అవుతాయి. లావా బ్లేజ్ క‌ర్వ్ 5జీ (Lava Blaze Curve 5G) ఫోన్ ఆండ్రాయిడ్ 13 వ‌ర్ష‌న్‌పై ప‌ని చేస్తుంది. ఆండ్రాయిడ్ 14 వ‌ర్ష‌న్ అప్‌డేట్‌తోపాటు మూడేండ్ల‌పాటు మూడు నెల‌ల‌కోసారి సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తుంది.

6.67 అంగుళాల హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌, 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీతో వ‌స్తున్న లావా బ్లేజ్ క‌ర్వ్ 5జీ (Lava Blaze Curve 5G) ఫోన్ 6.67- అంగుళాల ఫుల్ హెచ్‌డీ + (1,080x2,400 పిక్సెల్స్‌) డిస్‌ప్లేతో వ‌స్తుంది. ఈ డిస్‌ప్లే హెచ్‌డీఆర్‌, హెచ్‌డీఆర్‌10, హెచ్‌డీఆర్‌10+, వైడ్‌వైన్ ఎల్‌1కు మ‌ద్ద‌తుగా ఉంటుంది. సెల్ఫీ షూట‌ర్ కోసం హోల్ పంచ్ క‌టౌట్ ఉంటుంది. ఓక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ఎస్వోసీ చిప్‌సెట్ క‌లిగి ఉంటుంది. దీని ర్యామ్ 16 జీబీ వ‌ర‌కూ పొడిగించ‌వ‌చ్చు.

ఎల్ఈడీ ఫ్లాష్‌తోపాటు ట్రిపుల్ రేర్ కెమెరా యూనిట్ క‌లిగి ఉంటుందీ లావా బ్లేజ్ క‌ర్వ్ 5జీ (Lava Blaze Curve 5G). ఎల‌క్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేష‌న్ (ఈఐఎస్‌) మ‌ద్ద‌తుతో 64-మెగా పిక్సెల్ ప్రైమ‌రీ సెన్స‌ర్ కెమెరా ఉంటుంది. అద‌నంగా 8-మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ కెమెరా, 2-మెగా పిక్సెల్ మాక్రో సెన్స‌ర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్స్ సెన్స‌ర్ కెమెరా విత్ స్క్రీన్ ఫ్లాష్ క‌లిగి ఉంటుంది.

లావా బ్లేజ్ క‌ర్వ్ 5జీ (Lava Blaze Curve 5G) ఫోన్ 5జీ, 4జీ, బ్లూటూత్ 5.2, ఎఫ్ఎం రేడియో, వై-ఫై 802.11ఏ/బీ / జీ/ ఎన్/ ఏసీ/ ఎఎక్స్‌, ఓటీజీ, 3.5 ఎంఎం ఆడియో జాక్‌, యూఎస్బీ టైప్‌-సీ పోర్ట్ క‌నెక్టివిటీ క‌లిగి ఉంటుంది. యాక్సెల‌రో మీట‌ర్‌, యాంబియెంట్ లైట్ సెన్స‌ర్‌, మ్యాగ్నెటో మీట‌ర్‌, ప్రాగ్జిమిటీ సెన్స‌ర్ కూడా ఉన్నాయి. బ‌యో మెట్రిక్ అథంటికేష‌న్ కోసం ఫింగ‌ర్ ప్రింట్ సెన్స‌ర్‌, ఫేస్ అన్‌లాక్ ఫీచ‌ర్‌కు మ‌ద్ద‌తుగా ఉంది. యూఎస్బీ టైప్‌-సీ పోర్ట్ ద్వారా 33వాట్ల చార్జింగ్ మ‌ద్ద‌తుతో 5000 ఎంఏహెచ్ లిథియం పాలిమ‌ర్ బ్యాట‌రీ క‌లిగి ఉంటుంది.

Tags:    
Advertisement

Similar News