మొబైల్ వాడుతూనే ఇంగ్లిష్ నేర్చుకోవచ్చు! గూగుల్ కొత్త ఫీచర్!

రోజులో ఎక్కువ సమయం మొబైల్‌పైనే గడుపుతుంటారు చాలామంది. ఇలాంటప్పుడు మొబైల్ సాయంతోనే ఇంగ్లిష్ నేర్చుకుంటే ఎలా ఉంటుంది? ఇదే ఐడియాతో గూగుల్ ఓ కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది.

Advertisement
Update: 2024-05-04 06:45 GMT

రోజులో ఎక్కువ సమయం మొబైల్‌పైనే గడుపుతుంటారు చాలామంది. ఇలాంటప్పుడు మొబైల్ సాయంతోనే ఇంగ్లిష్ నేర్చుకుంటే ఎలా ఉంటుంది? ఇదే ఐడియాతో గూగుల్ ఓ కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. ఇదెలా పనిచేస్తుందంటే...

ఇంగ్లీష్‌ స్పీకింగ్ ఇంప్రూవ్‌ చేసుకోవాలనుకునేవాళ్లు రకరకాల టూల్స్ ద్వారా ఇంగ్లిష్ నేర్చుకుంటుంటారు. అయితే ప్రత్యేకించి టూల్స్ ఏవీ వాడాల్సిన పనిలేకుండా డైలీ మొబైల్ యూసేజ్‌తోనే ఇంగ్లిషన్ నేర్చుకునేలా ‘స్పీకింగ్ ప్రాక్టీస్’ అనే ఫీచర్‌నుఇంట్రడ్యూస్‌ చేసింది గూగుల్‌. ఇంగ్లిష్ మాట్లాడ్డానికి సిగ్గు పడేవాళ్లు మొబైల్‌లోని ఏఐ టూల్‌తో ఇంగ్లిష్‌లో మాట్లాడుతూ తమ స్పీకింగ్ స్కిల్స్‌ను ఇంప్రూవ్ చేసుకోవచ్చు.

‘స్పీకింగ్‌ ప్రాక్టీస్‌’ అనేది పర్సనల్ లాంగ్వేజ్‌ ట్యూటర్‌లా పనిచేసే ఇంటరాక్టివ్ ఏఐ టూల్. పలు స్పీకింగ్ ఎక్సర్‌సైజ్‌ల ద్వారా ఈ టూల్ మిమ్మల్ని గైడ్ చేస్తుంది. రోజువారీ కన్వర్జేషన్‌లలో ఉపయోగపడే సెంటెన్స్‌లను ఎలా మాట్లాడాలో నేర్పిస్తుంది. ఈ టూల్‌ను యాక్సెస్ చేసేందుకు ముందుగా గూగుల్ యాప్ ఓపెన్ చేయాలి. యాప్‌లో పైన లెఫ్ట్ కార్నర్‌‌లో ఉన్న సింబల్‌పై క్లిక్ చేస్తే గూగుల్ ల్యాబ్స్ ఓపెన్ అవుతుంది. అక్కడ ‘స్పీకింగ్ ప్రాక్టీస్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేసి కింద టర్న్ ఆన్ చేయడం ద్వారా ఫీచర్ ఆన్ అవుతుంది. కింద ‘ట్రై యాన్ ఎగ్జాంపుల్’ పై క్లిక్ చేసి స్పీకింగ్ ప్రాక్టీస్ మొదలు పెట్టొచ్చు.

స్పీకింగ్ ప్రాక్టీస్ సెషన్‌లో ముందుగా కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. వాటికి ఇంగ్లిష్ లో ఆన్సర్స్ ఎలా చెప్పాలో ట్రైనింగ్ ఇస్తుంది. ఉదాహరణకు ‘మీ కారు రంగు ఏంటి?’ అని గూగుల్ అడుగుతుంది. ‘బ్లూ’ అని చెప్తే.. దాన్ని సెంటెన్స్ రూపంలో ఎలా చెప్పాలో చెప్తుంది. ఇలా ప్రతీరోజూ భిన్న మైన టాస్క్‌లు చేస్తూ ఇంగ్లిష్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు.

Tags:    
Advertisement

Similar News