మహాత్మా గాంధీ డిగ్రీయే చదవలేదా ? ...ఆయన ముని మనమడు చెప్పిన నిజాలు.

" గవర్నర్ స్వయంగా చదువుకుంటాడనే ఆశతో నేను బాపు ఆత్మకథ కాపీని జమ్మూ రాజ్‌భవన్‌కు పంపాను" అని మహాత్మా గాంధీ ముని మనవడు తుషార్ గాంధీ ట్వీట్ చేశారు.

Advertisement
Update: 2023-03-26 03:15 GMT

జాతిపిత మహాత్మా గాంధీకి ఒక్క యూనివర్సిటీ డిగ్రీ కూడా లేదని జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

గురువారం ఐటీఎం గ్వాలియర్‌లో డాక్టర్ రామ్ మనోహర్ లోహియా స్మారక కీలకోపన్యాసం చేస్తూ గాంధీజీ విద్యార్హతల గురించి సిన్హా మాట్లాడారు.

“అతనికి ఒక్క యూనివర్సిటీ డిగ్రీ లేదని మీకు తెలుసా? మహాత్మా గాంధీకి న్యాయశాస్త్రంలో పట్టా ఉందని భావించేవారు మనలో చాలా మంది ఉన్నారు. లేదు, అతను న్యాయశాస్త్రంలో డిగ్రీ చేయలేదు. అతని ఏకైక అర్హత హైస్కూల్ డిప్లొమా. న్యాయవాద వృత్తికి అర్హత సాధించారుడు. అతనికి లా డిగ్రీ లేదు' అని సిన్హా చెప్పారు.

సిన్హా వ్యాఖ్యలను మహాత్మా గాంధీ ముని మనవడు తుషార్ గాంధీ కొట్టిపారేశారు.

“ఎం. కె. గాంధీ రెండు మెట్రిక్ లు చేశారు.ఒకటి ఆల్ఫ్రెడ్ హై స్కూల్ రాజ్‌కోట్ నుండి కాగా రెండవది లండన్‌లో. లండన్ యూనివర్శిటీకి అనుబంధంగా ఉన్న లా కాలేజీ ఇన్నర్ టెంపుల్ నుండి లా డిగ్రీని చదివి ఉత్తీర్ణత సాధించారు. అతను ఒకటి లాటిన్‌లో మరొకటి ఫ్రెంచ్‌లో రెండు డిప్లొమాలు పొందారు. J&K లెఫ్టినెంట్ గవర్నర్‌కు అవగాహన కల్పించడానికి ఇది చెప్తున్నాను” అని తుషార్ గాంధీ ట్వీట్ చేశారు.

" గవర్నర్ స్వయంగా చదువుకుంటాడనే ఆశతో నేను బాపు ఆత్మకథ కాపీని జమ్మూ రాజ్‌భవన్‌కు పంపాను" అని ట్వీట్ చేశారు. "నేను అంగీకరిస్తున్నాను, బాపు పూర్తి న్యాయశాస్త్రంలో పట్టా పొందలేదు!" అని తుషార్ గాంధీ ట్వీట్ చేశారు.

మహాత్మా గాంధీపై J&K లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. సోషల్ మీడియాలో తెలంగాణ మంత్రి కేటీఆర్ సహా అనేక మంది ప్రముఖులు సిన్హాపై విమర్శలు గుప్పించారు.

Tags:    
Advertisement

Similar News