మసీదులు కూల్చి మళ్లీ ఆలయాలు కడతాం

ఆలయ స్థలాలలో నిర్మించిన వాటిని మాత్రమే ధ్వంసం చేస్తామన్నారు. అది ఇవాళ అయినా కావొచ్చు, రేపైనా కావొచ్చు, భవిష్యత్తులో కావొచ్చు, లేదంటే 50 ఏళ్ల తరువాతైనా కావొచ్చు అంటూ మనసులో మాటను బ‌య‌ట‌పెట్టేశారు.

Advertisement
Update: 2023-06-26 05:10 GMT

మసీదులు కూల్చి మళ్లీ ఆలయాలు కడతాం

కర్నాటక బీజేపీ నేత, మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప తాజా వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దూమారం రేపుతున్నాయి. మసీదులపై ఆయ‌న చేసిన కామెంట్స్‌ వివాదాస్పదంగా మారాయి. హవేరీలో బీజేపీ సమావేశంలో పాల్గొన్న ఈశ్వరప్ప దేవాలయాల నిర్మాణంం కోసం మసీదులను కూల్చివేస్తామని చెప్పారు. మొఘలుల కాలంలో ధ్వంసం చేశారని నమ్ముతున్న అన్ని దేవాలయాలను మసీదుల స్థానంలో పునర్ నిర్మిస్తామన్నారు.

మొఘలులు దేవాలయాలను కూల్చి నిర్మించిన మసీదులన్నింటినీ నిర్ణీత సమయంలో తొలగించి వాటి స్థానంలో తిరిగి ఆలయాలను నిర్మిస్తామన్నారు ఈశ్వరప్ప. అదే సమయంలో తమకు కొత్త మసీదులను ధ్వంసం చేయాలనే ఉద్దేశ్యం లేదన్నారు. ఆలయ స్థలాలలో నిర్మించిన వాటిని మాత్రమే ధ్వంసం చేస్తామన్నారు. అది ఇవాళ అయినా కావొచ్చు, రేపైనా కావొచ్చు, భవిష్యత్తులో కావొచ్చు, లేదంటే 50 ఏళ్ల తరువాతైనా కావొచ్చు అంటూ మనసులో మాటను బ‌య‌ట‌పెట్టేశారు.

ఈశ్వరప్ప వివాదాల్లో చిక్కుకోవడం ఇదే తొలిసారి కాదు. ఏప్రిల్‌ నెలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ముస్లింల ప్రార్థన పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు. ముస్లింల ప్రార్థ‌న‌ల‌ను "తలనొప్పి"గా వర్ణించారు ఈశ్వరప్ప. సమీపంలోని మసీదు అజా వినిపించిన సమయంలో ఆయన ఇలాంటి కామెంట్స్‌ చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో ఈశ్వరప్ప ఎన్నికల రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు, మొన్నటి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలోనూ ఆయన పాల్గొనలేదు. కాగా.. తాజాగా మసీదుల విషయంలో ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్షాలు, ప్రజాస్వామిక వాదులు తప్పుబడుతున్నారు.

Tags:    
Advertisement

Similar News