సద్గురు జగ్గీ వాసుదేవ్‌ ఆరోగ్యం విషమం

గడిచిన నాలుగు వారాలుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారు సద్గురు. అయినప్పటికీ శివరాత్రి వేడుకలు నిర్వహించారు. అయితే మార్చి 15 నాటికి తలనొప్పి తీవ్రమైనట్లు సమాచారం.

Advertisement
Update: 2024-03-20 16:48 GMT

ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మిక గురువు జగ్గీవాసుదేవ్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ అపోలో హాస్పిటల్‌లో ఆయన మెదడుకు ఆపరేషన్‌ జరిగింద‌ని, ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు అపోలో డాక్టర్లు స్పష్టంచేశారు.

గడిచిన నాలుగు వారాలుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారు సద్గురు. అయినప్పటికీ శివరాత్రి వేడుకలు నిర్వహించారు. అయితే మార్చి 15 నాటికి తలనొప్పి తీవ్రమైనట్లు సమాచారం. మార్చి 16న MRI స్కాన్‌ తీయగా జగ్గీవాసుదేవ్‌ మెదడులో తీవ్ర రక్తస్రావం, వాపును గుర్తించారు డాక్టర్లు.


అనంతరం మార్చి 17న ఆయనకు బ్రెయిన్ సర్జరీ నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్తున్నారు. ఇవాళ స్వయంగా ఓ వీడియో రిలీజ్ చేశారు సద్గురు జగ్గీవాసుదేవ్‌. తనకు ఏం కాలేదని వీడియోలో చెప్పుకొచ్చారు.

Tags:    
Advertisement

Similar News