విపక్షాలు ఏకమవుతున్నది దేశం కోసం కాదు, ఈడీ కోసం... మోడీ ఫైర్

భారతదేశంలో ఇప్పుడు స్థిరమైన, నిర్ణయాత్మకమైన ప్రభుత్వం ఉంది. ఎవ్వరినీ బలవంతం చేయ‌కుండా ప్ర‌జల ఇష్టంతో సంస్కరణలు తీసుకొచ్చామని ప్రధాని మోడీ తన ప్రసంగంలో అన్నారు. మోడిపై ప్రజలకు ఉన్న నమ్మకం వార్తాపత్రికల వల్లనో, టీవీల వల్లనో వచ్చింది కాదని , సంవత్సరాల తరబడి తన అంకితభావం వల్ల ప్రజలకు ఆ నమ్మకం ఏర్పడిందన్నారు.

Advertisement
Update: 2023-02-08 13:15 GMT

బుధవారం లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధాని నరేంద్ర మోడీ సమాధానమిస్తూ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ను ఉద్దేశించి “2004-2014 కాలం స్కామ్ లు, హింసల దశాబ్దం” అని అన్నారు. 2004-2014 వరకు ప్రతి దాన్నీ సంక్షోభంగా మార్చడమే యుపిఎ ట్రేడ్‌మార్క్. "2004-2014 దేశం కోల్పోయిన దశాబ్దం, ప్రస్తుత దశాబ్దం భారతదేశ దశాబ్దం" అన్నారాయన. దేశంలోని ప్రతి రంగంపై ప్రస్తుతం అద్భుతమైన ఆశలున్నాయని, అయితే తమకు అనుకూలంగా ప్రజలిచ్చిన తీర్పు వల్ల కొంత మంది నిరాశలో మునిగిపోయారని మోడీ అన్నారు.

భారతదేశంలో ఇప్పుడు స్థిరమైన, నిర్ణయాత్మకమైన ప్రభుత్వం ఉంది. ఎవ్వరినీ బలవంతం చేయ‌కుండా ప్ర‌జల ఇష్టంతో సంస్కరణలు తీసుకొచ్చామని ప్రధాని మోడీ తన ప్రసంగంలో అన్నారు. మోడిపై ప్రజలకు ఉన్న నమ్మకం వార్తాపత్రికల వల్లనో, టీవీల వల్లనో వచ్చింది కాదని , సంవత్సరాల తరబడి తన అంకితభావం వల్ల ప్రజలకు ఆ నమ్మకం ఏర్పడిందన్నారు. అయితే అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణకు ప్రతిపక్షాలు డిమాండ్ చేసినప్పటికీ, అదానీ వివాదంపై వ్యాఖ్యానించకుండా ప్రధాని మోడీ తప్పించుకున్నారు. మోడీ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాకు మార్గాన్ని చూపించారు, ఆమె అందరికీ స్ఫూర్తిదాయకం అని అన్నారు.

దేశంలోని విపక్షాలు 9 ఏళ్ళుగా అర్దం పర్దం లేని ఆరోపణలతో తన మీద దాడి చేస్తున్నాయ‌ని మోడీ ఆరోపించారు. సైన్యం మీద, ఈడీ మీద, సీబీఐ మీద, ఈసీ, ఆర్ బీ ఐ ల మీద కూడా విపక్షాలు దాడి చేస్తున్నాయని మోడీ మండిపడ్డారు. నేడు విపక్ష నాయకులందరూ ఏకమవుతున్నారని, అయితే వాళ్ళ ఐక్యత దేశం కోసం కాదని ఈడి వాళ్ళను ఏకం చేస్తున్నదని మోడీ వ్యాఖ్యానించారు. 

Tags:    
Advertisement

Similar News