బాయ్స్.. గర్ల్స్.. ఇకపై నో సెపరేట్ స్కూల్స్..

బాలబాలికలకు వేర్వేరుగా స్కూల్స్ ఉండకూడదన్న‌ కేరళ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆదేశాల మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. 2023-24 విద్యా సంవత్సరం నుంచి ఈ కొత్త పద్ధతి అమలులోకి వస్తుంది.

Advertisement
Update: 2022-07-22 08:53 GMT

బాయ్స్ స్కూల్, గర్ల్స్ స్కూల్.. ఇకపై ఇలాంటివి కేరళలో కనిపించవు. ఉండేవన్నీ కో ఎడ్యుకేషన్ స్కూల్సే. బాలబాలికలకు వేర్వేరుగా స్కూల్స్ ఉండకూడదన్న‌ కేరళ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. 2023-24 విద్యా సంవత్సరం నుంచి ఈ కొత్త పద్ధతి అమలులోకి వస్తుంది. వేర్వేరుగా ఉన్న స్కూల్స్ ని ఒకటిగా చేసి కో ఎడ్యుకేషన్ మాత్రమే ఉండేలా చూడబోతున్నారు.

బాలబాలికలకు వేర్వేరుగా స్కూల్స్ ఉండటం, లింగ వివక్షతకు దారితీస్తోందని ఇటీవల ఓ వ్యక్తి కేరళ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ని ఆశ్రయించాడు. కొన్ని చోట్ల బాలికల స్కూల్స్ మాత్రమే ఉండటం వల్ల అక్కడ బాలురు చదువుకోలేకపోతున్నారని, బాలుర స్కూల్స్ మాత్రమే ఉన్న చోట బాలికలకు ఇబ్బందిగా ఉంటోందని అన్నారు. విద్యాహక్కు చట్టాన్ని ఇది ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. దీనిపై బాలల హక్కుల కమిషన్ విచారణ జరిపింది. వేర్వేరు పాఠశాలలు ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంది.

కో-ఎడ్యుకేషన్ సిస్టమ్ అమలుపై వివరణాత్మక నివేదికను 90 రోజుల్లోగా కమిషన్‌ కు సమర్పించాలని అధికారులను ఆదేశించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి స్కూల్స్ విడివిడిగా ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంది. కో-ఎడ్యుకేషన్ సిస్టమ్‌ అమలు చేయడంతో పాటు, పాఠశాలల్లో భౌతిక పరిస్థితులు, మరుగుదొడ్లు, ప్రాథమిక సౌకర్యాలను మెరుగుపరచాలని, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని కమిషన్ ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో ఇకపై బాలుర స్కూల్స్, బాలికల స్కూల్స్ అనేవి కేరళలో కనిపించవు.

Tags:    
Advertisement

Similar News