మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి షాక్...4 స్థానాల్లో పోటీ చేస్తే మూడింట్లో ఓటమి.

ఈ ఎన్నికల ఫలితాలు ఉపముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ కు ఎదురు దెబ్బగానే చెప్పవచ్చు. బీజేపీతో పొత్తులో ఉన్న శివసేన షిండే వర్గానికి కూడా ఈ ఎన్నికలు కోలుకోలేని దెబ్బగానే చెప్పవచ్చు.

Advertisement
Update: 2023-02-05 01:17 GMT

మహారాష్ట్రలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ జరగగా మహారాష్ట్ర వికాస్ అగాధి (MVA) 3 స్థానాల్లో, బీజేపీ 1 స్థానంలో కాంగ్రెస్ రెబల్ 1 స్థానంలో గెలుపొందారు. ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వంత నియోజకవర్గం నాగ్ పూర్ లో కూడా బీజేపీ ఓడిపోయింది.

నాసిక్ లో కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థి సత్యజీత్‌ తాంబే గెలుపొందారు. ఇక్కడ బీజేపీ పోటీ చేయలేదు. నాగ్‌పూర్ టీచర్స్ నియోజకవర్గంలో ఎంవిఎ అభ్యర్థి సుధాకర్ అడ్బాలే గెలుపొందారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి నాగోరావు గనార్‌ను 8,489 ఓట్ల తేడాతో ఎంవిఎ అభ్యర్థి సుధాకర్ ఓడించారు.

ఔరంగాబాద్ ఉపాధ్యాయుల నియోజకవర్గం, అమరావతి పట్టభద్రుల నియోజకవర్గంలో కూడా MVA అభ్యర్థులు గెలుపొందారు. కొంకణ్ టీచర్ల నియోజకవర్గం మాత్రం బీజేపీ కైవసం చేసుకుంది.

ఈ ఎన్నికల ఫలితాలు ఉపముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ కు ఎదురు దెబ్బగానే చెప్పవచ్చు. బీజేపీతో పొత్తులో ఉన్న శివసేన షిండే వర్గానికి కూడా ఈ ఎన్నికలు కోలుకోలేని దెబ్బగానే చెప్పవచ్చు.

శివసేనలో చీలిక తెచ్చి, మహారాష్ట్ర వికాస్ అగాధి (MVA) ప్రభుత్వాన్ని కూల దోసి షిండే ముఖ్యమంత్రి, ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రి అయ్యాక ఇవి మొదటి ఎన్నికలు. తొలి ఎన్నికలోనే బొక్క బోర్లాపడటం ఇరుపార్టీలకు రాబోయే ఇబ్బందులకు సూచిక‌

Tags:    
Advertisement

Similar News