ఆ రాష్ట్రంలో ఆత్మహత్యలు ఎక్కువ.. ఎందుకంటే..?

దేశంలో అత్యధిక ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్న రాష్ట్రంగా మహారాష్ట్ర రికార్డులకెక్కింది. దేశవ్యాప్తంగా 2021లో లక్షా 64వేలమంది బలవన్మరణాలకు పాల్పడగా, అందులో 22వేల మరణాలు మహారాష్ట్రలోనే నమోదు కావడం విశేషం..

Advertisement
Update: 2022-08-30 07:17 GMT

దేశంలో గతేడాది ఆత్మహత్యల వివరాలను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) విడుదల చేసింది. గతేడాదితో పోల్చి చూస్తే 2021లో ఆత్మహత్యల సంఖ్య పెరిగిందని నివేదికలు చెబుతున్నాయి. 7.2 శాతం మేర దేశంలో ఆత్మహత్యలు పెరిగాయని NCRB నివేదిక చెబుతోంది. ఈ నివేదిక ప్రకారం దేశంలో అత్యధిక ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్న రాష్ట్రంగా మహారాష్ట్ర రికార్డులకెక్కింది. దేశవ్యాప్తంగా 2021లో లక్షా 64వేలమంది బలవన్మరణాలకు పాల్పడగా, అందులో 22వేల మరణాలు మహారాష్ట్రలోనే నమోదు కావడం విశేషం..

రాష్ట్రాలవారీగా ఆత్మహత్యల సంఖ్య ఇలా ఉంది..

దేశ్యాప్తంగా మొత్తం ఆత్మహత్యల సంఖ్య - 1,64,033

మహారాష్ట్ర - 22,207 (13.5 శాతం)

తమిళనాడు - 18,925 (11.5 శాతం)

మధ్యప్రదేశ్ - 14,965 (9.1 శాతం)

పశ్చిమ బెంగాల్ - 13,500 (8.2 శాతం)

కర్నాటక - 13,056 (8.1 శాతం)

ఈ ఐదు రాష్ట్రాల్లో ఆత్మహత్యలు చేసుకున్నవారి సంఖ్య 50.4 శాతంగా ఉన్నాయి. మిగతా 49.5శాతం ఆత్మహత్యలు మిగిలిన 23రాష్ట్రాలు, ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాల్లో చోటు చేసుకోవడం విశేషం.

సూసైడ్ రేట్ అక్కడ అధికం..

ప్రతి లక్ష జనాభాకు చోటు చేసుకునే బలవన్మరణాలను సూసైడ్‌ రేట్‌ గా పరిగణిస్తారు. 2021లో భారత్‌ లో సూసైడ్ రేట్ 12గా ఉంది. అండమాన్‌ నికోబార్‌ లో మాత్రం ఆత్మహత్యల రేటు అత్యధికంగా 39.7శాతం ఉంది. సిక్కింలో 39.2శాతం, పుదుచ్చేరిలో 31.8శాతం, తెలంగాణలో 26.9శాతం, కేరళలో 26.9శాతంగా సూసైడ్ రేట్ ఉంది. విచిత్రం ఏంటంటే.. సూసైడ్ రేట్ అత్యధికంగా ఉన్న ఈ ప్రాంతాల్లో ఆత్మహత్యల సంఖ్య మాత్రం తక్కువగానే ఉంది. అంటే సగటు మరణాలే ఎక్కువ.

వృత్తిపరమైన సమస్యలు, ఒంటరితనం, కుటుంబ సమస్యలు, కుటుంబ హింస, మానసిక రుగ్మతలు, మద్యానికి బానిస కావడం, ఆర్థిక ఇబ్బందులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల కారణంగా ఆత్మహత్యల సంఖ్య మహారాష్ట్రలో ఎక్కువగా ఉందని NCRB నివేదిక ద్వారా తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News