ఆపరేషన్​ థియేటర్​లో ప్రీ- వెడ్డింగ్​షూట్​.. కానీ చివరికి

కర్నాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ భరంసాగర్ ప్రాంతంలో ప్రభుత్వ ఆస్పత్రిలో కాంట్రాక్ట్ విధానంలో ఓ వైద్యుడు పని చేస్తున్నాడు. ప్రీ వెడ్డింగ్ కోసమని ఈయన తనకు కాబోయే భార్యతో కలిసి ఆపరేషన్ థియేటర్ లో ఓ రోగికి ఆపరేష్ చేస్తున్నట్టుగా ఫోటోలు, వీడియోలను తీసుకున్నాడు.

Advertisement
Update: 2024-02-10 09:43 GMT

ఇటీవలికాలంలో ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో పిచ్చి పనులు చేస్తున్నవారు అక్కడో ఇక్కడో కనపడుతూనే ఉన్నారు. వాళ్ళ వీడియో వైరల్ అవడం సంగతి పక్కన పెడితే కొత్త కొత్త ఐడియాల వల్ల ఏకంగా ఉద్యోగాలకే ఎసరు వస్తోంది. ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో తనకు కాబోయే భార్యతో కలిసి ఏకంగా ఆపరేషన్ థియేటర్‌లో ఫోటో షూట్ చేయించుకున్నాడు ఓ కుర్ర డాక్టర్. దీనిని సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త వైరల్ అయింది. దీంతో ఇలాంటి ఎక్సట్రాలు వద్దంటూ అధికారులు ఆ యువకుడిని ఉద్యోగం నుంచి తొలగించిన ఘటన కర్ణాటకలో జరిగింది.


వివరాల్లోకి వెళితే

కర్నాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ భరంసాగర్ ప్రాంతంలో ప్రభుత్వ ఆస్పత్రిలో కాంట్రాక్ట్ విధానంలో ఓ వైద్యుడు పని చేస్తున్నాడు. ప్రీ వెడ్డింగ్ కోసమని ఈయన తనకు కాబోయే భార్యతో కలిసి ఆపరేషన్ థియేటర్ లో ఓ రోగికి ఆపరేష్ చేస్తున్నట్టుగా ఫోటోలు, వీడియోలను తీసుకున్నాడు. ఓ వ్యక్తిని పడుకోబెట్టి.. అతడికి ఆపరేషన్​ చేస్తున్నట్టుగా నటిస్తుండగా ఆ యువతి అతనికి సపర్యాలు చేస్తోంది. ఆ దృశ్యాలను కెమెరామెన్​లు నవ్వుతూ వీడియో తీశారు. చివరికి.. ఆపరేషన్​ చేయించుకుంటున్న వ్యక్తి లేచి పకపకా నవ్వడం మొదలుపెట్టాడు. అతి కొద్ది సమయంలోనే ఈ వీడియోసోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

విషయం కాస్త రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి దినేశ్ గుండూరావ్ దృష్టికి చేరింది. దీంతో ఆయన తీవ్రంగా స్పందించి, ప్రీ వెడ్డింగ్ షూట్‌కు ఆపరేషన్ థియేటర్‌ను వేదికగా చేసుకున్న కాంట్రాక్టు వైద్యుడిని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాకుండా, ఈ సస్పెండ్ వేటు తక్షణం అమల్లోకి వస్తుందని ఎక్స్‌లో వెల్లడించారు. ఆస్పత్రులు ఉన్నది ప్రజలకు వైద్యం అందించడానికే కానీ, ఇలా ప్రీవెడ్డింగ్ షూట్‌లకు కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడితే సహించేంది లేదని హెచ్చరించారు.

Tags:    
Advertisement

Similar News