కర్నాటకలో పోలింగ్ మొదలు..

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: ఏప్రిల్-29 శనివారం మొదలైన ఈ వోట్ ఫ్రమ్ హోమ్.. మే-6 వరకు కొనసాగుతుంది. కర్నాటకలో మొత్తం 2.62 లక్షలమంది ఇంటినుంచే ఓటు వేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు.

Advertisement
Update: 2023-04-30 05:38 GMT

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు 2023

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. అదేంటి పోలింగ్ మే-10న కదా..! సింగిల్ ఫేజ్ లో కర్నాటక పోలింగ్ అని షెడ్యూల్ విడుదల చేశారు కదా అని అనుకోవద్దు. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మే-10నే. కానీ వృద్ధులు, వికలాంగులు, ఇతర అనారోగ్యాలతో మంచం కదలలేని వారికి ఇంటి నుంచే ఓటు వేసే ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం.


ఆమధ్య ఏపీలో ఆత్మకూరు ఉప ఎన్నికకు ఈ పద్ధతిని ప్రయోగాత్మకంగా అమలు చేశారు, ఇతర రాష్ట్రాల్లో కూడా వోట్ ఫ్రమ్ హోమ్ విధానం తెరపైకి వచ్చింది. తాజాగా కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఇంటి నుంచే ఓటుని అమలులో పెట్టారు.

ఏప్రిల్-29 శనివారం మొదలైన ఈ వోట్ ఫ్రమ్ హోమ్.. మే-6 వరకు కొనసాగుతుంది. కర్నాటకలో మొత్తం 2.62 లక్షలమంది ఇంటినుంచే ఓటు వేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. వృద్ధులు, వికలాంగులు, దీర్ఘ కాలిక వ్యాధులతో మంచం కదలలేని స్థితిలో ఉన్నవారు ఇలా ఓటు వేసేందుకు దరఖాస్తు పెట్టుకున్నారు. వీరికి ఇంటివద్ద నుంచే ఓటు వేసే అవకాశం కల్పించారు అధికారులు.

ఓటింగ్ ఎలా..?

ఇంటినుంచి ఓటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నవారి వద్దకు అధికారులే బ్యాలెట్ పేపర్ తో వస్తారు. ఎన్నికల సిబ్బంది, విలేకరులు, పోలీసుల సమక్షంలో వారు బ్యాలెట్ పేపర్ తీసుకుని రహస్యంగా ఓటు వేసి, తిరిగి వారికి అందిస్తారు. దాన్ని బ్యాలెట్ బాక్స్ లో వేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం వీడియో రికార్డింగ్ చేస్తారు. ఈనెల 10న సాధారణ పోలింగ్ జరుగుతుంది. ఆరోజు ఈవీఎంలలో ఓటింగ్ జరుగుతుంది.


మే13న ఓట్ల లెక్కింపు రోజున ఈవీఎం ఓట్లతోపాటు, పోస్టల్ బ్యాలెట్లు, వోట్ ఫ్రమ్ హోమ్ బాక్స్ లు ఓపెన్ చేసి మొత్తం కలిపి లెక్కిస్తారు. అదే రోజు ఫలితాల ప్రకటన ఉంటుంది.

Tags:    
Advertisement

Similar News