కవితకు మళ్ళీ నోటీసులు జారీచేసిన‌ ఈడీ...ఈ నెల 20న విచారణకు హాజరు కావాలని ఆదేశం

ఈ రోజు ఉదయం 11 గంటల‌కు కవిత ఈడీ ముందు విచారణకు హాజరు కావాల్సి ఉండగా, తాను సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పెండింగ్ లో ఉన్నందువల్ల తాను ఈ రోజు ఈడీ కార్యాలయానికి రాలేనని చెప్పిన కవిత‌ తన తరపున తన ప్రతినిధిగా బీఆరెస్ ప్రధాన కార్యదర్శి, లాయర్ భరత్ ను ఈడీ కార్యాలయానికి పంపారు కవిత

Advertisement
Update: 2023-03-16 09:04 GMT

ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరో సారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 20 న ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని తమ నోటీసుల్లో ఈడీ అధికారులు ఆదేశించారు.

కాగా, ఈ రోజు ఉదయం 11 గంటల‌కు కవిత ఈడీ ముందు విచారణకు హాజరు కావాల్సి ఉండగా, తాను సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పెండింగ్ లో ఉన్నందువల్ల తాను ఈ రోజు ఈడీ కార్యాలయానికి రాలేనని చెప్పిన కవిత‌ తన తరపున తన ప్రతినిధిగా బీఆరెస్ ప్రధాన కార్యదర్శి, లాయర్ భరత్ ను ఈడీ కార్యాలయానికి పంపారు కవిత. ఈ రోజు తాను విచారణకు రాలేనని ఈడీకి లేఖ పంపారు . కవిత లేఖను పరిశీలించిన ఈడీ అధికారులు ఈ నెల 20న తమ ముందు హాజరు కావాల్సిందిగా కవితకు నోటీసులు జారీ చేశారు. 

Tags:    
Advertisement

Similar News