234 అరుదైన వన్యప్రాణుల అక్రమ రవాణా ప్లాన్ భగ్నం

దేవనహళ్లి కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆగస్టు 21న రాత్రి బ్యాంకాక్ నుంచి ఎఫ్‌డీ-137 విమానంలో ఓ ప్రయాణికుడు దిగాడు.

Advertisement
Update: 2023-08-23 09:22 GMT

234 అరుదైన వన్యప్రాణుల అక్రమ రవాణా ప్లాన్ భగ్నం

విమానశ్రయాల్లో గంజాయి, డ్రగ్స్ లాంటివి తరలించడానికి జరిగే ప్రయత్నాలు గురించి చాలా సార్లు వింటూ ఉంటాం.. అయితే గత కొంత కాలంగా రకరకాల జీవుల స్మగ్లింగ్ కూడా బాగా జరుగుతోంది. అక్రమంగా 234 వన్యప్రాణులను తరలిస్తున్న వ్యక్తిని బెంగళూరు ఎయిర్ కస్టమ్స్​ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని అరెస్టు చేసి రెండు ట్రాలీ బ్యాగుల్లోని వన్యప్రాణులను స్వాధీనం చేసుకున్నారు.




దేవనహళ్లి కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆగస్టు 21న రాత్రి బ్యాంకాక్ నుంచి ఎఫ్‌డీ-137 విమానంలో ఓ ప్రయాణికుడు దిగాడు. అనంతరం గ్రీన్‌ ఛానల్‌ దాటి విమానాశ్రయం అరైవల్‌ ప్రాంతం నుంచి డిపార్చర్‌ గేట్‌ వైపు వస్తున్నాడు. అయితే అప్పుడే ఎందుకో కస్టమ్స్​ అధికారులు అనుమానంతో అతడిని ఆపి రెండు ట్రాలీ బ్యాగులను తనిఖీ చేశారు. ఇంకేముంది.. అందులో 234 అనుకోని అతిథులు బయటపడ్డాయి.




అరుదైన కొండచిలువలు, ఊసరవెళ్లులు, తాబేళ్లు, ఎలిగేటర్లు, కంగారు పిల్లతో సహా మొత్తం 234 జంతువులను చూసి వారు షాక్ అయ్యారు. అయితే వాటిని విడివిడిగా చిన్న చిన్న ప్లాస్టిక్ బాక్స్ లలో పెట్టినప్పటికీ ఊపిరి ఆడక చిన్ని కంగారు చనిపోయినట్టుగా తెలుస్తోంది.




నిందితుడిని కస్టమ్స్ చట్టం, 1962లోని సెక్షన్ 104 కింద అరెస్టు చేశారు. రెండు ట్రాలీల్లోని వన్యప్రాణులను కస్టమ్స్ చట్టం, 1962లోని సెక్షన్ 110 కింద స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోందని కస్టమ్స్ అధికారులు తెలిపారు.

Tags:    
Advertisement

Similar News