మా విధానాలు దేశమంతా విస్తరించండి.. - కేంద్రానికి కేజ్రీవాల్ సూచన

దేశమంతటా పాఠశాల విద్య, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను మెరుగపరచడంలో ఢిల్లీ ప్రభుత్వాన్ని ఉపయోగించుకోవాలని కేంద్రాన్ని కోరారు.

Advertisement
Update: 2022-08-16 14:27 GMT

పేదలకు మెరుగైన ఆరోగ్యం, విద్య విషయంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆదర్శవంతమైన విధానాలు రూపొందించిన విషయం తెలిసిందే. ఆయన అమలు చేసిన కార్యక్రమాలను పలు రాష్ట్రాలు సైతం ఆదర్శంగా తీసుకొని తమ దగ్గర మొదలుపెట్టాయి. పేదలకు మెరుగైన విద్య, వైద్యం అందించడాన్ని ఢిల్లీ ప్రజలేకాక.. దేశం మొత్తం అభినందించింది. ఆయన రెండోసారి అధికారం చేపట్టడానికి ఈ విధానాలు ఎంతో తోడ్పడ్డాయి. నేషనల్ మీడియా సైతం అరవింద్ కేజ్రీవాల్ విధానాలను ప్రశంసించాయి.

ఇదిలా ఉంటే తాజాగా ఆయన కేంద్రానికి కీలక సూచనలు చేశారు. తమ విధానాలు.. దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు. దేశమంతటా పాఠశాల విద్య, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను మెరుగపరచడంలో ఢిల్లీ ప్రభుత్వాన్ని ఉపయోగించుకోవాలని కేంద్రాన్ని కోరారు. దీంతో ప్రపంచంలోనే భారత్ మారేందుకు దోహదపడుతుందని చెప్పారు.

అంతేకాకుండా ఉచిత విద్య, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను ఉచితాలుగా పరిగణించొద్దని విజ్ఞప్తి చేశారు. పెద్ద ఎత్తున ప్రభుత్వ పాఠశాలలను ప్రారంభించాల్సిన అవసరముందని చెప్పారు. ఉన్న వాటిని మెరుగుపరిచి, పిల్లల భవిష్యత్తుకు ఫ్యాకల్టీకి శిక్షణ ఇవ్వాలని అన్నారు. తాము కేవలం ఐదేళ్లలోనే విపరీతమైన మార్పులను తీసుకొచ్చామని తెలిపారు.

పిల్లలకు ఉచిత విద్య

ఈ ఏడాది చివర్లో గుజరాత్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే పిల్లలకు ఉచిత విద్య అందిస్తామని అన్నారు. అంతేకాకుండా నూతన పాఠశాలలను ప్రారంభించి, ప్రస్తుతం ఉన్న స్కూళ్లను మెరుగుపరుస్తామని చెప్పారు. ఇప్పటికే గుజరాత్‌లో పలు కీలక ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే. ఉచిత విద్యుత్, ఉద్యోగ కల్పన, నిరుద్యోగ భృతి వంటివి జాబితాలో ఉన్నాయి.

Tags:    
Advertisement

Similar News