అల్లోపతి తో క్యాన్సర్,హై బీపీ తగ్గవు, ఆవు మూత్రంతోనే తగ్గుతాయి..రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు

ఉత్తరాఖండ్‌ ఆయుర్వేద యూనివర్సిటీ, దీనదయాళ్‌ కామధేను గోశాల సమితి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ ఆయుర్వేద సదస్సులో ఆయన మాట్లాడుతూ, అల్లోపతి వైద్యాన్ని టార్గెట్ చేశారు. కేన్సర్, హై హైబీపీ, మధుమేహం వంటి వ్యాధులను ఆయుర్వేద వైద్యంతో పూర్తిగా నయం చేయవచ్చన్నారు.

Advertisement
Update: 2023-03-21 03:13 GMT

అల్లోపతి వైద్యంపై యోగా గురువు రాందేవ్ మళ్ళీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అల్లోపతి వైద్యంలో కేన్సర్, హైబీపీ, మధుమేహం వంటి వ్యాధులకు చికిత్స లేదని , గోమూత్రం, ఆయుర్వేద ఔషధాల కలయికతో కేన్సర్ వంటి వ్యాధులను తమ సంస్థలో పూర్తిగా నయం చేసినట్టు రాందేవ్ బాబా చెప్పుకొచ్చారు.

ఉత్తరాఖండ్‌ ఆయుర్వేద యూనివర్సిటీ, దీనదయాళ్‌ కామధేను గోశాల సమితి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ ఆయుర్వేద సదస్సులో ఆయన మాట్లాడుతూ, అల్లోపతి వైద్యాన్ని టార్గెట్ చేశారు. కేన్సర్, హై హైబీపీ, మధుమేహం వంటి వ్యాధులను ఆయుర్వేద వైద్యంతో పూర్తిగా నయం చేయవచ్చన్నారు.

ఆవు పాలతో రోగ నిరోధకశక్తి పెరుగుతుందని, వాటితో చాలా వరకు రోగాలను నయం చేయవచ్చన్నారు. ఆవు మూత్రం కూడా అనేక రోగాలనునయం చేస్తుందని ఆయన చెప్పారు. ఆయర్వేదంలో మూలాల నుంచి ఆ రోగాలను నిర్మూలించవచ్చని ఆయన అన్నారు.

ఈ సదస్సుకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి, కేబినెట్ మంత్రి సత్పాల్ మహారాజ్, ఆయుర్వేద వర్సిటీ వైస్ చాన్సలర్ సునీల్ జోషి తదితరులు హాజరయ్యారు.

అల్లోపతి వైద్యాన్ని రాందేవ్ బాబా టార్గెట్ చేయడం ఇదే మొదటి సారి కాదు. గతంలోనూ పలుమార్లు ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొన్ని సార్లు ఆయన తన వ్యాఖ్యలకు క్షమాపణ కూడా చెప్పవలసి వచ్చింది.

Tags:    
Advertisement

Similar News