'ఆప్' కు జాతీయ పార్టీ హోదా !

ఆప్‌ను జాతీయ పార్టీ స్థాయికి చేర్చ‌డంలో సహకరించిన గుజరాత్ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అరవింద్ కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు. చట్టప్రకారం తమ పార్టీ జాతీయ స్థాయి హోదా పొందడానికి గుజరాత్ ఎన్నికల్లో పోలైన ఓట్ల సంఖ్య సరిపోతుందని ఆయన అన్నారు.

Advertisement
Update: 2022-12-08 17:08 GMT

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌)కి జాతీయ పార్టీ హోదా ద‌క్క‌నున్న‌ది. గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 5 సీట్లు సాధించ‌డం తో పాటు ఓటింగ్ శాతం ఆప్ కు జాతీయ హోదాకు మార్గం సుగ‌మం చేసింది. గుజరాత్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఖాతా తెరవడంతో తమ పార్టీకి జాతీయ పార్టీ హోదా లభించినట్టయిందని ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.

ఆప్‌ను జాతీయ పార్టీ స్థాయికి చేర్చ‌డంలో సహకరించిన గుజరాత్ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. చట్టప్రకారం తమ పార్టీ జాతీయ స్థాయి హోదా పొందడానికి గుజరాత్ ఎన్నికల్లో పోలైన ఓట్ల సంఖ్య సరిపోతుందని అన్నారు. గుజ‌రాత్ ఎన్నిక‌ల ప‌లితాలు వెలువ‌డిన అనంత‌రం 5 స్థానాలు గెలుచుకున్న త‌ర్వాత కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు.

''దేశంలో జాతీయ స్థాయి హోదా పొందిన పార్టీలు చాలా త‌క్కువ‌గా ఉన్నాయి.తాజా ఎన్నిక‌ల‌లో 5 స్థానాలు గెలుపొంద‌డం ద్వారా ఆప్‌ ఇప్పుడు జాతీయ పార్టీ హోదా కేటగిరిలో చేరింది'' అని ఆయన అన్నారు. పదేళ్ల క్రితం ప్రారంభించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో...ఢిల్లీ, పంజాబ్‌లో అధికారంలో ఉందని, గుజరాత్ ఎన్నికలతో తమ పార్టీ జాతీయ హోదాకు చేరిందని అన్నారు. గుజరాత్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ప్రతిసారి తనను ప్రజలెంతగానో ఆదరించారని, గుజరాత్ ప్రజల ప్రేమ, ఆదరణకు మరిచిపోలేనని చెప్పారు. 

Tags:    
Advertisement

Similar News