Ratnam Movie | విశాల్ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్

Ratnam Movie - మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న విశాల్, దర్శకుడు హరితో కలిశాడు. రత్నం సినిమాను విడుదలకు సిద్ధం చేశాడు.

Advertisement
Update: 2024-01-26 16:03 GMT

మాస్ యాక్షన్ హీరో విశాల్ సినిమాకు అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్‌లో మంచి డిమాండ్ ఉంది. విశాల్ అంటే అందరికీ యాక్షన్ చిత్రాలు గుర్తుకొస్తాయి. అలాంటిది యాక్షన్ డైరెక్టర్ హరితో విశాల్ మూవీ అంటే యాక్షన్ మూవీ లవర్స్‌కు ఇక పండుగే. దానికి తగ్గట్టుగానే ‘రత్నం’ అనే మూవీ ఫుల్ యాక్షన్ మూవీగా రాబోతోంది. ఆల్రెడీ రిలీజైన కంటెంట్ చూసి మాస్ లవర్స్‌లో ఈ మూవీ మీద అంచనాలు పెరిగాయి.

జీ స్టూడియోస్‌తో పాటు స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా ‘రత్నం’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. రత్నం చిత్రానికి హరి డైరెక్టర్‌గా, కార్తికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీలో విశాల్ హీరోగా, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్‌ అందిస్తున్నాడు.

రత్నం ఫస్ట్ షాట్ టీజర్‌, పాటలు ఇలా ఇప్పటికే అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తయినట్టుగా మేకర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చిత్రయూనిట్ రిలీజ్ డేట్‌ను లాక్ చేసింది. ఏప్రిల్ 26న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతోన్నట్టుగా ప్రకటించారు. 

Tags:    
Advertisement

Similar News