Kushi Movie | విజయ్ దేవరకొండ ఖుషి మూవీ సెన్సార్ టాక్

Kushi Movie Censor Talk - ఖుషి మూవీ సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో లవ్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయంట.

Advertisement
Update: 2023-08-24 02:37 GMT

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ‘ఖుషి’ రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. మరో 8 రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్, రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రాన్నిదర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించారు. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుందీ సినిమా. సెన్సార్ బృందం ‘ఖుషి’ మూవీకి యూఏ సర్టిఫికెట్ జారీ చేసింది. సెప్టెంబర్ 1న పాన్ ఇండియా స్థాయిలో థియేటర్స్ లో ‘ఖుషి’ గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

టైటిల్ నుంచి టీజర్, పాటలు, ట్రైలర్ తో అన్ని వర్గాల ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించిన సినిమా ‘ఖుషి’. విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్.. వాళ్ల మధ్య కెమిస్ట్రీ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ కూడా ఈ విషయాన్ని మరోసారి బయటపెట్టింది.

165 నిమిషాల నిడివితో ఉన్న ‘ఖుషి’ మూవీకి యూఏ సర్టిఫికెట్ జారీ చేసింది సెన్సార్ బృందం. సాధారణంగా చూసుకుంటే ఈ సినిమా లెంగ్త్ ఎక్కువే. అయితే ఈమధ్య కాలంలో లెంగ్త్ ఎక్కువగా ఉన్నప్పటికీ, కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు అలాంటివేం పట్టించుకోవట్లేదు. అదే నమ్మకంతో ఖుషీ సినిమాను కాస్త ఎక్కువ లెంగ్త్ తోనే రిలీజ్ చేస్తున్నారు.

ఇటీవల నిర్వహించిన మ్యూజిక్ కన్సర్ట్ సూపర్ హిట్టయింది. త్వరలోనే గ్రౌండ్ ఈవెంట్స్ మరిన్ని నిర్వహించబోతున్నారు. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 1న ‘ఖుషి’ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయబోతోన్నారు.

Tags:    
Advertisement

Similar News