Venkatesh's Saindhav Movie: వెంకటేష్ కొత్త సినిమా పేరు సైంధవ్

Venkatesh's new movie titled Saindhav: వెంకటేశ్ కొత్త సినిమాకు సైంధవ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈరోజు ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు. వెంకీ చెప్పిన డైలాగ్ అదిరింది

Advertisement
Update: 2023-01-25 09:29 GMT

Venkatesh's Saindhav Movie: వెంకటేష్ కొత్త సినిమా పేరు సైంధవ్

విక్టరీ వెంకటేష్ హీరోగా నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మాణంలో శైలేష్ కొలను డైరెక్ట్ చేయబోతున్న సినిమా సైంధవ్. వెంకటేష్ కెరీర్ లో ప్రతిష్టాత్మక 75వ సినిమా ఇది. ఇప్పటికే సినిమాను ఎనౌన్స్ చేయగా, ఈరోజు గ్లింప్స్ విడుదల చేశారు.

గడ్డంతో , చేతిలో గన్ పట్టుకుని పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నాడు వెంకీ. బ్యాక్‌గ్రౌండ్‌లో కారు , పేలుడు చూస్తే దర్శకుడు శైలేష్.. వెంకటేష్ తో అదిరిపోయే స్టైలిష్ యాక్షన్ మూవీ తీయబోతున్నాడని అర్థమవుతుంది. సైంధవ్ లో యాక్షన్‌ ఎక్కువగా ఉంటుందని దర్శకుడు గ్లిమ్స్ ద్వారా హింట్ ఇచ్చాడు.

చంద్రప్రస్థ అనే ఫిక్షనల్ నగరంలో ఓడరేవు ప్రాంతంలోకి ప్రవేశించి, ఆపై కంటైనర్ నుండి తుపాకీని బయటకు తీస్తూ వెంకీ నడుస్తూ వచ్చే గ్లిమ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. చివర్లో “నేనిక్కడ ఉంటారా… ఎక్కడికీ ఎల్లనూ… రమ్మను…” అంటూ వార్నింగ్ ఇస్తూ చెప్పిన డైలాగ్ హైలెట్.

త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ స్టార్ట్ అవుతుంది. వీడియోలో సంతోష్ నారాయణన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సైంధవ్ అన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదల కానుంది.


Full View


Tags:    
Advertisement

Similar News