Saindhav Movie - వెంకీ సినిమాకు విడుదల తేదీ ఫిక్స్

Saindhav Movie - వెంకటేష్ కొత్త సినిమా సైంధవ్. మొన్ననే సెట్స్ పైకి వచ్చింది. అంతలోనే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు.

Advertisement
Update: 2023-03-31 14:30 GMT

విక్టరీ వెంకటేష్ ల్యాండ్‌మార్క్ 75వ చిత్రం ‘సైంధవ్’. టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఓ భారీ షెడ్యుల్ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ షూట్ లో వెంకటేష్ తో పాటు, ఇతర తారాగణం పాల్గొంటున్నారు.

తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఎనౌన్స్ చేశారు. సైంధవ్ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. డిసెంబరు 25న (క్రిస్మస్) మొదటి సోమవారం సెలవుదినం కాబట్టి, సినిమాకు లాంగ్ వీకెండ్‌ కలిసిరానుంది. అనౌన్స్ మెంట్ పోస్టర్ లో వెంకటేష్ చేతిలో మెషిన్ గన్ పట్టుకుని కంటైనర్ పైన కూర్చోవడం కనిపిస్తుంది. కంటైనర్‌లో కొన్ని పేలుడు పదార్థాలను గమనించవచ్చు.

సైంధవ్ భారీ బడ్జెట్‌తో భారీ స్థాయిలో రూపొందుతోంది. వెంకటేష్‌ కెరీర్లో భారీ బడ్జెట్ సినిమా ఇదే. బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు.

దసరా సినిమాతో దుమ్ముదులిపిన సంతోష్ నారాయణన్, ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మణికందన్ కెమెరామెన్ గా, గ్యారీ బిహెచ్ ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. సైంధవ్ పాన్ ఇండియా చిత్రం. అన్ని దక్షిణాది భాషలతో పాటు, హిందీలో విడుదల కానుంది.

Tags:    
Advertisement

Similar News