అవును.. నేను హీరోను డామినేట్ చేశాను

గణేష్ హీరోగా నటించిన మూవీ స్వాతిముత్యం. ఈ సినిమాలో హీరోని డామినేట్ చేశానని చెబుతోంది వర్ష.

Advertisement
Update: 2022-10-04 07:42 GMT

హీరోను హీరోయిన్ ను డామినేట్ చేస్తే ఎవ్వరూ ఒప్పుకోరు. అదే కొత్త హీరో సినిమా అయితే ఓకే. స్వాతిముత్యం సినిమాలో అదే జరిగింది. ఈ సినిమాతో గణేశ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. వర్ష బొల్లమ ఆల్రెడీ కొన్ని సినిమాలు చేసింది. కెరీర్ పరంగా గణేశ్ కంటే సీనియర్. 


సో.. ఆటోమేటిగ్గా గణేశ్ పై వర్ష డామినేషన్ కొనసాగింది. అయితే ఇది బయట కాదు. స్వాతిముత్యం సినిమాలో అలా జరిగింది. కథ ప్రకారం, గణేశ్ ను డామినేట్ చేసే పాత్రలో తను నటించానని చెప్పుకొచ్చింది వర్ష.


"సినిమాలో పాత్రల పరంగా చూస్తే నా పాత్ర కొంచెం డామినేటింగ్ గా ఉంటుంది. గణేష్ పాత్ర చాలా అమాయకంగా ఉంటుంది. నేను పోషించిన భాగ్యలక్ష్మి పాత్ర ఒక స్కూల్ టీచర్. ఆ పాత్రకు తగ్గట్లు కొంచెం పెత్తనం చూపిస్తాను."


ఇలా పాత్ర పరంగా పెత్తనం చూపించానే తప్ప, బయట గణేశ్ పై ఎలాంటి డామినేషన్ లేదని అంటోంది వర్ష. నిజానికి గణేశ్ కొత్తవాడిగా ఎప్పుడూ కనిపించలేదని, ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ నుంచి రావడంతో, అంతా తెలిసిన వాడిలానే కనిపించాడని చెప్పుకొచ్చింది. కెమెరా ముందు కూడా గణేశ్ తడబడలేదని అంటోంది. దసరా కనుకగా రేపు థియేటర్లలోకి వస్తోంది స్వాతిముత్యం సినిమా.

Tags:    
Advertisement

Similar News