Akhanda 2 Movie: అఖండ -2 వస్తోంది.. క్లారిటీ ఇచ్చిన తమన్

Balakrishna's Akhanda 2 Movie:అఖండకు సీక్వెల్ ఉంటుందని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ క్లారిటీ ఇచ్చాడు. ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేసిన తమన్ అఖండ -2 ఉంటుందని త్వరలో కలుద్దామని ట్వీట్ చేశాడు.

Advertisement
Update: 2023-02-19 13:22 GMT

Akhanda 2 Movie: అఖండ -2 వస్తోంది.. క్లారిటీ ఇచ్చిన తమన్

బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. కరోనా సమయంలో ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి కూడా జంకుతున్న సమయంలో విడుదలైన అఖండ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. అప్పటిదాకా ఎన్టీఆర్, ఎన్టీఆర్ 2, రూల‌ర్‌ వంటి వరుస డిజాస్టర్లతో వెనుకబడిపోయిన బాలకృష్ణకు అఖండ సినిమా విజయాల దాహం తీర్చింది.

ఈ సినిమా విజయంలో సంగీతం కూడా కీలకపాత్ర పోషించింది. తమన్ ఈ మూవీకి ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ గురించి ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. అయితే అఖండ సినిమాకు కొనసాగింపుగా అఖండ-2 ఉంటుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. నిర్మాతలు కూడా అఖండకు సీక్వెల్ తీస్తామని ప్రకటించినప్పటికీ ఆ తర్వాత దాని ఊసే లేదు.


అయితే తాజాగా అఖండకు సీక్వెల్ ఉంటుందని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ క్లారిటీ ఇచ్చాడు. ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేసిన తమన్ అఖండ -2 ఉంటుందని త్వరలో కలుద్దామని ట్వీట్ చేశాడు. దీంతో బాలకృష్ణ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


ప్రస్తుతం బోయపాటి శ్రీను యంగ్ హీరో రామ్ తో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత అఖండ-2 స్క్రిప్ట్ వర్క్ చేయనున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ దసరాకు విడుదల కానుంది. ఆ తర్వాత అఖండ- 2 సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

Tags:    
Advertisement

Similar News