Ashok Galla | పాటలతో సిద్ధమైన అశోక్ గల్లా

Ashok Galla - దేవకీ నందన వాసుదేవ అనే సినిమా చేస్తున్నాడు అశోక్ గల్లా. ఈ సినిమా నుంచి పాటలు రాబోతున్నాయి.

Advertisement
Update: 2024-05-01 08:35 GMT

హీరో అనే చిత్రంతో సక్సెస్ ఫుల్ గా ఎంట్రీ ఇచ్చిన సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా ప్రస్తుతం గుణ 369 ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో 'దేవకీ నందన వాసుదేవ' అనే సినిమా చేస్తున్నాడు.

హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి కథ అందించడం విశేషం. ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. లలితాంబిక ప్రొడక్షన్స్‌లో సోమినేని బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే హీరోను పరిచయం చేసిన టీజర్‌ వచ్చింది. ఆ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సినిమా పాటల విడుదల కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఇందులో భాగంగా ఫస్ట్ సింగిల్ ఏమయ్యిందే ప్రోమోను విడుదల చేశారు. ఇటీవలి కాలంలో అనేక చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లను అందించిన సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. పూర్తి సాంగ్ మే3 న విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు.

గ్రాండ్ ప్రొడక్షన్ డిజైన్‌తో భారీ ఎత్తున తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల డీవోపీగా పని చేస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్. వారణాసి మానస హీరోయిన్ గా నటిస్తోంది.

Tags:    
Advertisement

Similar News