Trivikram| విజయ్ భాస్కర్ కు త్రివిక్రమ్ అండ

Trivikram - త్రివిక్రమ్, విజయ్ భాస్కర్ కలిసి మంచి సినిమాలు చేశారు. ఇప్పుడు విజయ్ భాస్కర్ కోసం త్రివిక్రమ్ ముందుకొచ్చాడు.

Advertisement
Update: 2024-05-01 08:25 GMT

తెలుగు సినీ రంగంలో ద‌ర్శ‌కుడిగా త‌న‌కంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న ద‌ర్శ‌కుల్లో ఒక‌రు కె.విజ‌య్‌భాస్క‌ర్. నువ్వేకావాలి, మ‌న్మ‌థుడు, మ‌ల్లీశ్వ‌రి వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ఆయ‌న.. ఉషా ప‌రిణ‌యం అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

విజ‌య్‌భాస్క‌ర్ క్రాఫ్ట్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై సొంతంగా ఈ సినిమాను నిర్మిస్తున్న విజ‌య్‌భాస్క‌ర్ తన కొడుకు శ్రీ‌క‌మ‌ల్ హీరోగా ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. తాన్వీ ఆకాంక్ష అనే అచ్చ‌తెలుగ‌మ్మాయి ఈ చిత్రంతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం కాబోతుంది.

గ‌త కొన్ని రోజులుగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఐటెం సాంగ్‌ను హీరో శ్రీ‌క‌మ‌ల్‌, సీర‌త్‌క‌పూర్‌పై చిత్రీక‌రిస్తున్నారు. ఆర్‌.ఆర్‌. ధ్రువ‌న్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ సాంగ్ షూట్ చివ‌రి రోజున సెట్‌కు స్టార్ రైట‌ర్ అండ్ డైరక్టర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ వచ్చాడు. త్రివిక్ర‌మ్‌, విజ‌య్‌భాస్క‌ర్ క‌ల‌యిక‌లో ఎన్ని సూప‌ర్‌హిట్ సినిమాలు వ‌చ్చాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ సూప‌ర్‌హిట్ కాంబినేష‌న్ చాలా రోజుల త‌రువాత క‌ల‌వ‌డం ఒక శుభ‌సూచ‌కం.

అలీ, వెన్నెల‌కిషోర్‌, శివాజీ రాజా, ఆమ‌ని, సుధ‌, కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను ఆగస్ట్ లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. 

Tags:    
Advertisement

Similar News