Thaman: పోటీ ఉంటేనే బాగుంటుంది

Thaman - పోటీ ఉన్నప్పుడే రాణిస్తామంటున్నాడు సంగీత దర్శకుడు తమన్. సంక్రాంతి పోటీపై తనదైన శైలిలో స్పందించాడు.

Advertisement
Update: 2023-01-11 03:34 GMT

సంక్రాంతి సినిమాలతో చిరంజీవి-బాలకృష్ణ పోటీ పడుతున్నారు. అవే సినిమాలతో ఇటు దేవిశ్రీ ప్రసాద్, అటు తమన్ కూడా పోటీ పడుతున్నారు.

వాల్తేరు వీరయ్య సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తే, వీరసింహారెడ్డికి తమన్ సంగీతం అందించాడు. మరి ఈ సంక్రాంతికి ఇద్దరి మధ్య పోటీ ఎలా ఉండబోతోంది? దీనిపై సంగీత దర్శకుడు తమన్ స్పందించాడు.

"పోటి అనేది ప్రతి చోట ఉంటుంది. పోటీ ఉన్నప్పుడే మంచి కంటెంట్ వస్తుంది. ఆరోగ్యకరమైన పోటి మంచి విషయమే కదండీ. అన్ని సినిమాలు గొప్పగా ఆడాలి. అందరూ బావుండాలి. తెలుగు సినిమా ఇప్పుడు మంచి స్థితిలో ఉంది. చిరంజీవి గారి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ గారి వీరసింహా రెడ్డి రెండూ గొప్పగా ఆడాలని కోరుకుంటున్నాను."

ఇలా పోటీపై తనదైన శైలిలో స్పందించాడు తమన్. వీరసింహారెడ్డి సినిమాకు తను ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో స్పీకర్లు పగిలిపోతాయని చెబుతున్న ఈ సంగీత దర్శకుడు, బాలయ్య సినిమాకు ఆ మాత్రం కొట్టాలంటున్నాడు.

Tags:    
Advertisement

Similar News