బాలయ్య సినిమా కోసం మరోసారి తమన్

బాలయ్య సినిమాకు మరోసారి మ్యూజిక్ అందించబోతున్నాడు తమన్. అఖండ తర్వాత బాలయ్యకు తమన్ పనిచేయడం ఇది రెండో సారి.

Advertisement
Update: 2022-08-11 13:29 GMT

నటసింహ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో సినిమా రాబోతోందనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడా ప్రాజెక్టుకు సంబంధించి మరో అధికారిక ప్రకటన వచ్చింది. #NBK108 వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని బాలకృష్ణ పుట్టినరోజున గతంలోనే అధికారికంగా ప్రకటించారు. ఈరోజు చిత్ర నిర్మాతలు, సంగీత దర్శకుడికి సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు.

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఈ చిత్రానికి స్టార్ సెన్సేషనల్ కంపోజర్ తమన్ సంగీతం అందించనున్నాడు. షైన్ స్క్రీన్స్ నిర్మాణంలో బాలకృష్ణ, అనిల్ రావిపూడి , థమన్ కాంబినేషన్ కచ్చితంగా మేజిక్ క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

అనిల్ రావిపూడి, తమన్ కలసి పనిచేయడం ఇదే తొలిసారి. కాగా, బాలకృష్ణ సెన్సేషనల్ హిట్ అఖండకు తమన్ బ్లాక్ బస్టర్ సంగీతాన్ని అందించాడు.

మాస్‌ పల్స్‌ తెలిసిన అనిల్‌ రావిపూడి బాలకృష్ణ కోసం విభిన్నమైన, మాస్‌ స్క్రిప్ట్‌ని సిద్ధం చేశాడు. నటసింహ నందమూరి బాలకృష్ణని మునుపెన్నడూచూడని పాత్రలో చూపించబోతున్నాడు.

సినిమాలో బాలయ్య తండ్రి పాత్రలో కనిపించబోతున్నాడు. అతడికి కూతురిగా పెళ్లిసందD ఫేమ్ శ్రీలీల నటించనుంది. త్వరలోనే సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ ఇవ్వబోతున్నారు.

Tags:    
Advertisement

Similar News