Thandel | నాగచైతన్య రికార్డ్

Nagachaitanya's Thandel - విడుదలకు ముందే రికార్డ్ సృష్టించింది తండేల్ సినిమా. చైతూ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బిజినెస్ ఇది.

Advertisement
Update: 2024-05-02 17:31 GMT

యూట్యూబ్ లైక్స్, శాటిలైట్ రైట్స్, ఓటీటీ రైట్స్.. ఇలా విడుదలకు ముందు రికార్డులు బద్దలుకొట్టడానికి చాలా అవకాశాలున్నాయి. ఇప్పటికే చాలామంది హీరోలు తమ మార్క్ చూపించారు. ఇప్పుడు నాగచైతన్య వంతు వచ్చింది. తండేల్ సినిమా చేస్తున్నాడు చైతూ.

ఈ సినిమాతో అతడు ఓటీటీ రైట్స్ లో రికార్డ్ బద్దలుకొట్టాడు. నెట్ ఫ్లిక్స్ కంపెనీ, ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కుల్ని ఏకంగా 40 కోట్ల రూపాయలకు (అన్ని భాషల హక్కులు కలిపి) కొనుగోలు చేసింది. నాగచైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ నంబర్ ఇది. ఇప్పటివరకు అతడు నటించిన ఏ సినిమా, ఈ స్థాయిలో అమ్ముడుపోలేదు.

తండేల్ ఆ ఘనత సాధించడానికి చాలా కారణాలున్నాయి. ఈ సినిమాలో నాగచైతన్యతో పాటు, టాప్ పెర్ఫార్మర్ కమ్ డాన్సర్ సాయిపల్లవి ఉంది. కార్తికేయ-2తో పాన్ ఇండియా హిట్ కొట్టిన చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

వీటితో పాటు గీతాఆర్ట్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ నుంచి, అల్లు అరవింద్ బ్యాకింగ్ తో వస్తున్న సినిమా కావడంతో ఈ రేటు పలికింది. అలా తండేల్ విడుదలకు ముందే, నాగచైతన్య వ్యక్తిగతంగా ఓ రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. 

Tags:    
Advertisement

Similar News