Love Me | కీరవాణి నుంచి మరో పాట

Love Me - దిల్ రాజు బ్యానర్ పై ఆశిష్ హీరోగా నటిస్తున్న సినిమా లవ్ మీ. ఈ సినిమా నుంచి మరో మెలొడీ వచ్చింది.

Advertisement
Update: 2024-05-04 07:42 GMT

టాలెంటెడ్ యాక్టర్స్ ఆశిష్, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించిన చిత్రం ‘లవ్ మీ’. ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించారు. ‘ఇఫ్ యు డేర్’ అనేది ఉప శీర్షిక.

ఈ హారర్ థ్రిల్లర్‌ను ప్రపంచవ్యాప్తంగా ఈనెల 25న గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన వచ్చింది. తాజాగా మేకర్స్ శుక్రవారం రోజున ఓ లవ్ మెలోడిని విడుదల చేశారు.

ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలోని ‘స్టుపిడ్ హార్ట్’ అనే సాంగ్‌ను ప్రముఖ లిరిక్ రైటర్ చంద్రబోస్ రాయటం విశేషం. ఈ పాట వినగానే ఆకట్టుకుంటోంది.

ఓ ఆత్మ ప్రేమకథతో వస్తున్న డిఫరెంట్ సినిమా ఇది. ఆశిష్, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి స్టార్ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించగా, అవినాష్ కొల్ల ఆర్ట్ డైరక్టర్ గా వ్యవహరించాడు.

Full View

Tags:    
Advertisement

Similar News