Gam Gam Ganesha | ఆనంద్ దేవరకొండ పాటల సందడి

Gam Gam Ganesha - ఆనంద్ దేవరకొండ తాజా చిత్రం గం గం గణేశా. ఈ సినిమా పాటల సందడి మొదలైంది.

Advertisement
Update: 2024-05-04 07:52 GMT

బేబి" వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రేక్షకుల ముందుకొస్తున్న సినిమా "గం..గం..గణేశా". ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

ఆనంద్ దేవరకొండ తన కెరీర్ లో చేస్తున్న ఫస్ట్ యాక్షన్ మూవీ ఇది. ఈ నెల 31న "గం..గం..గణేశా" సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. తాజాగా "గం..గం..గణేశా" సాంగ్ ను రిలీజ్ చేశారు. హీరో హీరోయిన్లు ఆనంద్ దేవరకొండ,‌ ప్రగతి శ్రీవాస్తవ మద్య రొమాంటిక్ లవ్ సాంగ్ గా ఈ పాట తెరకెక్కింది.

ఈ సమ్మర్ లో టాలీవుడ్ నుంచి వస్తున్న ఇంట్రెస్టింగ్ మూవీగా "గం..గం..గణేశా" పై అంచనాలున్నాయి. వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకు చేతన్ భరధ్వాజ్ సంగీతం అందించాడు. విజయ్ పోలాకీ డాన్స్ కంపోజ్ చేశాడు. 

Full View

Tags:    
Advertisement

Similar News