Lucky Lakshman: సోహెల్ సినిమా టీజర్ వచ్చేసింది

Syed Sohel's Lucky Lakshman: లక్కీ లక్ష్మణ్ గా మనముందుకు రాబోతున్నాడు బిగ్ బాస్ ఫేమ్ సోహైల్. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ లాంచ్ చేశారు.

Advertisement
Update: 2022-12-04 03:56 GMT

బిగ్ బాస్ ఫేమ్ స‌య్య‌ద్ సోహైల్‌, మోక్ష హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం 'లక్కీ లక్ష్మ‌ణ్'. ద‌త్తాత్రేయ మీడియా బ్యాన‌ర్‌పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఎ.ఆర్‌.అభి దర్శ‌క‌త్వంలో హ‌రిత గోగినేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ ఏడాదికి ఫినిషింగ్ టచ్ ఇస్తూ, డిసెంబర్ 30న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్బంగా చిత్ర యూనిట్ టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది. ఈ కార్య‌క్ర‌మంలో సోహైల్‌, నిర్మాత హ‌రిత గోగినేని, ద‌ర్శ‌క‌డు అభి, బిగ్ బాస్ ఫేమ్స్‌.. మెహ‌బూబ్‌, అఖిల్ సార్థ‌క్‌, స‌న్నీ త‌దిత‌రులు పాల్గొన్నారు. టిప్స్ మ్యూజిక్ ద్వారా ఆడియో రిలీజ్ అవుతుంది.

టీజర్ లో హీరో పాత్ర లక్ష్మణ్ ను లక్కీ గయ్ గా చూపించారు. తననుతాను చాలా లక్కీగా ఫీల్ అయ్యే వ్యక్తిగా హీరోను చూపించారు. ఇతడి జీవితంలో ఇద్దరు అమ్మాయిలుంటారు, మరో ఇద్దరు స్నేహితులు కూడా ఉంటారు. వాళ్ల వల్ల లక్ష్మణ్ లైఫ్ ఎలాంటి మలుపులు తిరిగింది. చివరిగా లక్ష్మణ్ లక్కీ అనిపించుకున్నాడా లేదా అనేది ఈ సినిమా కథాంశం.

టీజర్ ఆసక్తికరంగా సాగింది. సోహైల్ లుక్స్ బాగున్నాయి. అనూప్ రూబెన్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు సోహైల్. అతడి కెరీర్ కు ఈ సినిమా సక్సెస్ చాలా అవసరం.


Full View


Tags:    
Advertisement

Similar News