Superstar Krishna: ముగిసిన కృష్ణ అంత్యక్రియలు.. ఘనంగా తుది వీడ్కోలు

Super star Krishna: కుటుంబ సభ్యులు, అభిమానులు కృష్ణ కు తుది వీడుకోలు పలికారు. ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా అంత్య క్రియలు ముగిశాయి.

Advertisement
Update: 2022-11-16 12:52 GMT

ఒక శకం ముగిసింది. సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ఘనంగా జరిగాయి. గుండెపోటుతో మంగళవారం ఉదయం కన్నుమూశారు కృష్ణ. ఆయన భౌతికకాయానికి ఈరోజు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కృష్ణ కుటుంబ సభ్యులతో పాటు, మరికొంతమంది ప్రముఖులు మాత్రమే ఈ అంతిమ సంస్కార కార్యక్రమంలో పాల్గొన్నారు.


అంతకంటేముందు, కాంటినెంటల్ హాస్పిటల్ నుంచి నేరుగా స్వగృహానికి కృష్ణ పార్థివ దేహాన్ని తీసుకొచ్చారు. అట్నుంచి అటు పద్మాలయ స్టుడియోస్ కు ప్రజల సందర్శనార్థం భౌతికకాయాన్ని తరలించాలని భావించారు. కానీ అప్పటికే చీకటి పడ్డంతో సెంటిమెంట్ ప్రకారం, ఇంట్లోనే పార్థివ దేహాన్ని ఉంచారు.


ఈరోజు ఉదయం పద్మాలయ స్టుడియోస్ కు కృష్ణ భౌతిక కాయాన్ని తరలించారు. దాదాపు సినీప్రముఖులంతా కృష్ణను కడసారి చూశారు. పలువురు రాజకీయ ప్రముఖులు కూడా నివాళులు అర్పించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కృష్ణకు నివాళులు అర్పించారు. 


అనంతరం పద్మాలయ స్టుడియోస్ నుంచి మహాప్రస్థానంకు కృష్ణ అంతిమయాత్ర సాగింది. వేలాది మంది అభిమానులు మహాప్రస్థానంకు తరలి వెళ్లారు. అయితే లోపలకు మాత్రమే కృష్ణ కుటుంబ సభ్యులతో పాటు, మరికొద్దిమందిని మాత్రమే అనుమతించారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కృష్ణకు అంతిమ సంస్కారాలు నిర్వహించాడు మహేష్ బాబు.

Tags:    
Advertisement

Similar News