Ooru Peru Bhairavakona | సందీప్ కిషన్ మూవీ ట్రయిలర్ రిలీజ్

Ooru Peru Bhairavakona - సందీప్ కిషన్ తాజా చిత్రం ఊరు పేరు భైరవకోన. తాజాగా ఈ సినిమా ట్రయిలర్ లాంచ్ చేశారు.

Advertisement
Update: 2024-01-18 16:47 GMT

హీరో సందీప్ కిషన్, డైరెక్టర్ విఐ ఆనంద్ కాంబోలో వస్తున్న ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తుండగా, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర సమర్పిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్ కు, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫిబ్రవరి 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ గా నిర్వహించిన ఈవెంట్ లో ట్రైలర్ ని లాంచ్ చేసింది.

సందీప్ కిషన్, వర్షా బొల్లమ్మ మధ్య వండర్ ఫుల్ ల‌వ్ కెమిస్ట్రీ తో ప్రారంభమైన ట్రైలర్ తర్వాత బైర‌వ‌కోన అనే ఫాంట‌సీ ప్రపంచంలోకి ప్రేక్షకులని తీసుకెళ్ళింది. 'గరుడు పురాణంలో మాయమైన ఆ నాలుగు పేజీలే ఈ భైరవకోన' అనే వాయిస్ ఇంట్రోతో భైరవకోన ఫాంటసీ ప్రపంచాన్ని చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు.

భగవంతుడి ఆధీనంలో కూడా లేనిది క‌ర్మ సిద్ధాంతం.. లిఖించబడిందే జరుగుతుంది. రక్తపాతం జరగనీ''. ‘’చేతికి అంటిన ర‌క్తాన్ని క‌డిగినంత సులువు కాదు.. చేసిన పాపాన్ని క‌డ‌గ‌డం”అనే డైలాగ్స్ కథపై చాలా క్యురియాసిటీని పెంచాయి.

శేఖర్ చంద్ర అందించిన నేపధ్య సంగీతం విజువల్స్ ని మరింతగా ఎలివేట్ చేశాయి. రాజ్ తోట కెమెరా పనితనం బాగుంది. ఫాంటసీ విజువల్ వండర్ గా రిలీజైన ఈ ట్రైలర్ చిత్రంపై అంచనాలని మరింతగా పెంచింది.

Full View

Tags:    
Advertisement

Similar News