Nithin SreeLeela - నితిన్ సినిమాలో శ్రీలీల

SreeLeela Nithin - నితిన్ కొత్త సినిమాలో రష్మిక హీరోయిన్. కానీ ఇప్పుడు శ్రీలీలను కూడా తీసుకున్నారు.

Advertisement
Update: 2023-04-03 14:36 GMT

ఓ క్రేజీ హీరోయిన్ మార్కెట్లోకి వచ్చిందంటే చాలు, నితిన్ సినిమాలో ఆమె నటించాల్సిందే. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు నితిన్. హిట్ హీరోయిన్ ను వెంటనే బుక్ చేసి తన సినిమాల్లోకి తీసుకుంటాడు. అయితే హీరోయిన్ శ్రీలీల మాత్రం మిస్ అయింది.

నితిన్ ఆఫర్ ఇచ్చేలోపే శ్రీలీల బిజీ అయిపోయింది. దీంతో ఆమెను మరో విధంగా తన సినిమాలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు నితిన్. ఆమెతో ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నాడు.

వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు నితిన్. ఇందులో హీరోయిన్ గా రష్మికను తీసుకున్నారు. భీష్మ కాంబినేషన్ ను అలా రిపీట్ చేస్తున్నారు. ఇందులో శ్రీలీలతో ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె డేట్స్ కోసం ప్రయత్నిస్తున్నారు.

సాంగ్ రెడీగా ఉంది. నితిన్ కూడా రెడీ. శ్రీలల ఎప్పుడు కాల్షీట్లు ఇస్తే అప్పుడు షూట్ చేయడానికి యూనిట్ సిద్ధంగా ఉంది. ఈ సాంగ్ కోసం కేవలం 2 రోజుల కాల్షీట్లు మాత్రమే అడుగుతున్నారు. ఆ 2 రోజులు కూడా కేటాయించడానికి శ్రీలీలకు చాలా కష్టంగా ఉంది. అంత బిజీగా ఉంది ఈ భామ

Tags:    
Advertisement

Similar News