Shabdham Movie - శబ్దం సినిమాలోకి మరో సీనియర్ నటి

Simran in Shabdham Movie - శబ్దం సినిమా లోకి మరో సీనియర్ ఆర్టిస్ట్ ను తీసుకున్నారు. ఈసారి సిమ్రాన్ వంతు.

Advertisement
Update: 2023-03-17 11:32 GMT

హీరో ఆది పినిశెట్టి మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్‌ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 'వైశాలి' సూపర్ హిట్ తర్వాత దర్శకుడు అరివళగన్‌తో కలసి ఆది పినిశెట్టి చేస్తున్న చిత్రం 'శబ్దం'. 7G ఫిల్మ్స్ శివ, ఆల్ఫా ఫ్రేమ్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. 


ద్విభాషా చిత్రంగా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా లక్ష్మి మీనన్ నటిస్తోంది. తాజాగా ఈ చిత్రంలో ప్రముఖ సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ కీలక పాత్ర పోషిస్తున్నారని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ మేరకు ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.


ఈ సినిమాలో నటీనటుల ఎంపిక అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది. ముందుగా ఓ కీలక పాత్ర కోసం లైలాను తీసుకున్నారు. ఇప్పుడు మరో కీలక పాత్ర కోసం సిమ్రాన్ ను తీసుకున్నారు. వీళ్లిద్దరూ ఒకప్పుడు స్టార్ హీరోయిన్లు అనే విషయం తెలిసిందే. ఇలా ఒక్కో పాత్రకు ఒక్కో ప్రత్యేకమైన నటిని ఎంపిక చేస్తున్నారు.


ఈ చిత్రం కోసం ప్రముఖ నటీనటులు, మంచి సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. అరుణ్ పద్మనాభన్ కెమెరా మెన్ గా పని చేస్తుండగా, స్టార్ కంపోజర్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. సాబు జోసెఫ్ ఎడిటర్ గా మనోజ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ నడుస్తోంది. త్వరలోనే టీజర్ ను విడుదల చేస్తారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది శబ్దం.

Tags:    
Advertisement

Similar News