Tillu Square | వాలంటైన్స్ డే సీజన్ లో టిల్లూ

Siddhu Jonnalagadda - సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న సీక్వెల్ టిల్లూ స్క్వేర్. ఈ సినిమాకు రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు.

Advertisement
Update: 2023-10-28 16:23 GMT

కల్ట్ బ్లాక్‌బస్టర్ 'డీజే టిల్లు'లో టిల్లు వంటి వినోదాత్మక పాత్రతో స్టార్‌బాయ్ సిద్ధు అలరించాడు. సిద్ధుని టిల్లు పాత్రలో మరోసారి చూడాలని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండటంతో.. సిద్ధు, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కలిసి 'డీజే టిల్లు' చిత్రానికి సీక్వెల్‌ను రూపొందించాలని నిర్ణయించారు.

ఇందులో భాగంగా 'డీజే టిల్లు'కు సీక్వెల్ గా 'టిల్లు స్క్వేర్‌' ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా సినిమా విడుదల తేదీని ప్రకటించారు. 'టిల్లు స్క్వేర్‌' సినిమాను వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 9న విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని నిర్మాత నాగవంశీ స్వయంగా ప్రకటించాడు.

టిల్లూ స్క్వేర్‌లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. డీజే టిల్లులో నేహా శెట్టి పోషించిన రాధిక పాత్ర తరహాలో ఈ పాత్ర కూడా గుర్తుండిపోయేలా ఉంటుందని మేకర్స్ అంటున్నారు. అటు అనుపమ కూడా తన పాత్రపై ఎలాంటి హింట్స్, లీక్స్ ఇవ్వడం లేదు. ఇప్పటికే రామ్ మిరియాల స్వరపరిచి, పాడిన టికెటే కొనకుండా అనే పాటను మేకర్స్ విడుదల చేయగా భారీ హిట్ అయ్యింది.

నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ చిత్రానికి సాయి ప్రకాష్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నాడు. మల్లిక్ రామ్ టిల్ స్క్వేర్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌పై సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. సిద్ధు జొన్నలగొడ్డ స్వయంగా ఈ సినిమాకు కథ రాసుకున్నాడు.

Tags:    
Advertisement

Similar News