Raviteja: నిర్మాతలకు ఉచిత సలహా ఇచ్చిన రవితేజ

Raviteja: టాలీవుడ్ నిర్మాతలకు ఓ ఉచిత సలహా ఇచ్చాడు రవితేజ. శ్రీలీల విషయంలో ప్రొడ్యూసర్లు తొందర పడాలంటున్నాడు ఈ సీనియర్ హీరో.

Advertisement
Update: 2022-12-19 05:30 GMT

హీరో రవితేజ నిర్మాతలందరికీ ఓ ఉచిత సలహా ఇచ్చాడు. ఓ హీరోయిన్ డేట్స్ ను అర్జెంట్ గా లాక్ చేసుకోవాలని సూచిస్తున్నాడు. కుదిరితే చెక్కులిచ్చి మరీ ఆమెను ఫిక్స్ చేసుకోవాలని చెబుతున్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా? హీరోయిన్ శ్రీలీల.

రెండో సినిమాకే శ్రీలీల ఎక్కడికో వెళ్లిపోయిందంటున్నాడు రవితేజ. పెళ్లిసందD సినిమాతోనే చాలామందికి నచ్చేసిందని, ధమాకా సినిమాతో మరింత మందికి నచ్చేస్తుందని చెబుతున్నాడు. రాబోయే రోజుల్లో శ్రీలీల ఎవ్వరికీ దొరకదని, తొందరగా చెక్కులు ఇచ్చేసి, ఆమె కాల్షీట్లు లాక్ చేసుకోవాలని చెబుతున్నాడు.

ధమాకా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ రాత్రి గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలో శ్రీలీలపై ఇలా స్పందించాడు రవితేజ. ఇదే వేడుకలో దర్శకుడిగా మారబోతున్న తన కథారచయిత బెజవాడ ప్రసన్నకుమార్ కు కూడా శుభాకాంక్షలు అందించాడు రవితేజ.

ధమాకా సినిమా కచ్చితంగా హిట్ అవుతుందంటున్నాడు రవితేజ. ఎందుకంటే, టోటల్ టీమ్ లో పాజిటివ్ దృక్పథం కనిపిస్తోందని, తను కూడా ఈమధ్య కాలంలో ఇంతలా ఎప్పుడా ఎంజాయ్ చేయలేదని చెబుతున్నాడు.

ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తోంది ధమాకా సినిమా. త్రినాధరావు నక్కిన డైరక్ట్ చేసిన ఈ సినిమాను, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు.

Tags:    
Advertisement

Similar News