Dhamaka Movie box office: రూ.100 కోట్ల క్లబ్ లో రవితేజ మూవీ

Ravi Teja's Dhamaka Movie box office collections: మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమా అరుదైన ఘనత సాధించింది. రూ.100 కోట్ల క్లబ్ లో స్థానం సంపాదించింది.

Advertisement
Update: 2023-01-06 11:29 GMT

Dhamaka Movie box office: రూ.100 కోట్ల క్లబ్ లో రవితేజ మూవీ 

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమా అరుదైన ఘనత సాధించింది. రూ.100 కోట్ల క్లబ్ లో స్థానం సంపాదించింది. డిసెంబర్ 23వ తేదీన విడుదలైన ఈ సినిమా కేవలం రెండు వారాల్లోపే 100 కోట్ల క్లబ్ లో చేరడం విశేషం. ధమాకా సినిమాలో రవితేజకు జోడిగా శ్రీలీల నటించగా త్రినాథ రావు నక్కిన దర్శకత్వం వహించాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి. డిసెంబర్ 23వ తేదీన ఈ మూవీ విడుదల కాగా రివ్యూల పరంగా మిశ్రమ స్పందన తెచ్చుకుంది.

అయితే ఈ సినిమాలో రవి తేజ మార్క్ కామెడీ, ఫైట్స్, మంచి పాటలతో పాటు శ్రీలీల గ్లామర్ ప్రేక్షకులకు వినోదాన్ని పంచాయి. దీంతో సినిమా బాగుందని మౌత్ టాక్ రావడంతో వసూళ్లు రోజురోజుకూ పెరిగాయి. ఆ తర్వాత ధమాకా సినిమా యావరేజ్ స్థాయి నుంచి సూపర్ హిట్ స్టేటస్ తెచ్చుకుంది. క్రిస్మస్ పండుగతో పాటు న్యూ ఇయర్ కూడా కలిసి రావడంతో ధమాకా మూవీ మంచి కలెక్షన్స్ సాధించింది.

తాజాగా ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్ లో చేరినట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందుకు సంబంధించి అఫీషియల్ గా పోస్టర్ విడుదల చేశారు. రవితేజ హీరోగా నటించిన సినిమాల్లో రూ.100 కోట్ల కలెక్షన్స్ సాధించిన తొలి సినిమాగా ధమాకా నిలిచింది. చిరంజీవి హీరోగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ హీరోగా నటించిన నరసింహారెడ్డి సినిమాలు సంక్రాంతికి విడుదలవుతుండగా.. అప్పటివరకు ధమాకా సినిమాకు పోటీ కూడా ఉండకపోవడంతో ఈ మూవీ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News