రష్మిక డ్రీమ్ రోల్స్ ఇవే

తన డ్రీమ్ రోల్స్ బయటపెట్టింది రష్మిక. మంచి పీరియాడిక్ మూవీ ఉంటే చేస్తానంటోంది.

Advertisement
Update: 2022-08-10 03:47 GMT

ప్రతి హీరోయిన్ కు ఓ డ్రీమ్ రోల్ ఉంటుంది. రష్మికకు కూడా అలాంటి డ్రీమ్స్ ఉన్నాయి. కెరీర్ లో ఇప్పటికే పీక్ స్టేజ్ లో కొనసాగుతున్న ఈ ముద్దుగుమ్మ, తన డ్రీమ్ రోల్స్ బయటపెట్టింది. ఎప్పటికైనా అలాంటి సినిమాలు చేస్తానంటోంది.

"పిరియాడికల్ మూవీ చేయాలని ఉంది. అలాగే స్పోర్ట్స్, యాక్షన్, బయోపిక్.. ఇలా డిఫరెంట్ మూవీస్ చేయాలనీ ఉంటుంది. కెరీర్ ఇప్పుడే మొదలుపెట్టాం కదా.. ఇంకా చాలా చేయాలి."

ఇలా తన డ్రీమ్ రోల్స్ బయటపెట్టింది రష్మిక. నిజానికి చాలామంది హీరోయిన్లు చేస్తున్న జానర్లే ఇవన్నీ. రష్మిక లాంటి స్టార్ హీరోయిన్ తలుచుకుంటే ఆమె కోసం ఓ పీరియాడిక్ మూవీ లేదా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కథను తయారుచేయడం మేకర్స్ కు కష్టం కాదు.

కాకపోతే ప్రస్తుతం రష్మిక, తన డ్రీమ్ రోల్స్ ను నెరవేర్చుకునే ఆలోచనలో ఉందా లేదా అనేది అసలు సమస్య. ఎందుకంటే, ఆమెకు స్టార్ హీరోల సరసన ఛాన్సులు వస్తున్నాయి. అటు బాలీవుడ్ నుంచి కూడా వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో డ్రీమ్స్ రోల్స్ అంటూ ప్రయోగాలు చేస్తే మొదటికే మోసం వస్తుంది. ఈ విషయం రష్మికకు కూడా తెలుసు. అందుకే ఇంకా లాంగ్ కెరీర్ ఉందంటోంది ఈ బ్యూటీ.

Tags:    
Advertisement

Similar News