Ram Pothineni - దసరాకి రామ్-బోయపాటి సినిమా

Ram Pothineni, boyapati - రామ్, బోయపాటి కాంబో లో వస్తున్న సినిమాను రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.

Advertisement
Update: 2023-03-28 09:56 GMT

బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, రామ్ పోతినేని కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు యాక్షన్, మాస్ కూడా ఉండబోతున్నాయి. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.


తాజాగా ఈ సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేశారు మేకర్స్. బోయపాటి-రామ్ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20న థియేటర్లలోకి రానుంది. మాస్ తో పాటు ఫ్యామిలీస్ ని మెప్పించే సినిమాకి ఇది సరైన తేదీ అని యూనిట్ భావిస్తోంది. పైగా దసరా సెలవులు సినిమాకి కలిసిరాబోతున్నాయి.


అనౌన్స్ మెంట్ పోస్టర్ లో రామ్ తన చేతితో గంగిరెద్దు (ఎద్దు)ని లాగుతూ పోస్టర్ లో మాస్ గా కనిపిస్తున్నాడు. బోయపాటి శ్రీను రామ్ ని మాస్ క్యారెక్టర్ లో చూపిస్తున్నాడు. మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల, ఈ సినిమాలో రామ్ కు జోడిగా నటిస్తోంది. 


తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకు సంతోష్ డిటాకే కెమెరామెన్ గా పని చేస్తున్నాడు. హిందీతో పాటు సౌత్ లోని అన్ని భాషల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది.

Tags:    
Advertisement

Similar News