Masooda movie: మసూద విమర్శలపై నిర్మాత స్పందన ఇది

masooda movie runtime : ఈ సినిమా నిడివి ఎక్కువ ఉంది. తెలిసి మరీ అంత రన్ టైం ఎందుకు ఉంచారు

Advertisement
Update: 2022-12-08 09:33 GMT

మసూద సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాడు నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా. కంటెంట్ బాగుంటే ఆడియన్స్ ఆటోమేటిగ్గా థియేటర్లకు వస్తారనే తన నమ్మకం మసూదతో మరోసారి నిజమైందని చెప్పుకొచ్చాడు. మళ్లీ రావా, ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ తర్వాత ఇప్పుడు మసూదతో సక్సెస్ అందుకున్నాడు ఈ నిర్మాత.


ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రాహుల్ యాదవ్.. సినిమాపై వచ్చిన విమర్శలపై కూడా స్పందించాడు. మరీ ముఖ్యంగా సినిమా నిడివి ఎక్కువగా ఉందనే విమర్శలను పూర్తిగా వ్యతిరేకించాడు. 


"సినిమా లెంగ్త్ విషయానికి వస్తే.. అంతా ఫాస్ట్ పేసేడ్ మూవీకి అలవాటు పడిపోయాం. డ్రామాకి సెటప్, టైమ్ కావాలి. స్లో అనిపించవచ్చు కానీ.. నేను ఆ ప్లేస్ తీసుకుని.. గోపీ పాత్రని అలా చూపించకపోతే.. గోపీ పాత్రకు సెకండాఫ్‌లో అర్థమే ఉండదు. గోపీ ఎంత భయస్తుడో చెప్పకుండా.. సెకండాఫ్ చూపిస్తే సీన్ పండదు. ఫస్టాఫ్ అతను భయస్తుడు అని చూపిస్తేనే జనాలకి నచ్చుతుంది. అదే జరిగింది."


ఇలా మసూద నిడివిపై సూటిగా స్పందించాడు రాహుల్. మసూద లాంటి కథలకు ఆమాత్రం రన్ టైమ్ ఉండాలని వాదిస్తున్న ఈ నిర్మాత, తన సినిమాకు ఆదివారం నుంచి ఆక్యుపెన్సీ పెరిగిన విషయాన్ని వెల్లడించాడు. మౌత్ టాక్ తోనే తన సినిమా హిట్టయిందని తెలిపాడు.

Tags:    
Advertisement

Similar News