Pawan Kalyan - హీరోయిన్ లేకుండానే సినిమా

Pawan Kalyan no heroine - పవన్ కొత్త సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. కానీ ఎవ్వరూ పవన్ సరసన నటించడం లేదు.

Advertisement
Update: 2023-02-23 14:41 GMT

ఓ స్టార్ హీరో ఉంటే, తప్పకుండా పక్కన స్టార్ హీరోయిన్ ఉండాల్సిందే. లేకపోతే పాటలకు చోటుండదు. అయితే పవన్ కల్యాణ్ మాత్రం హీరోయిన్ లేకుండానే సినిమా స్టార్ట్ చేశాడు. అదే వినోదాయ శితం రీమేక్. సముత్తరఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్ లేదు.


నిజానికి ఇందులో ఇద్దరు హీరోయిన్లున్నారు. ఓ హీరోయిన్ గా ప్రియాప్రకాష్ వారియర్, మరో హీరోయిన్ గా కేతిక శర్మను తీసుకున్నారు. అయితే ఈ ఇద్దరూ పవన్ సరసన నటించడం లేదు. 


ఈ రీమేక్ చిత్రంలో పవన్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. సాయితేజ్ లవర్ గా కేతిక శర్మ కనిపించనుంది. ఇక మరో కీలక పాత్రలో ప్రియా ప్రకాష్ నటించనుంది. 


మరి సినిమాలో పవన్ కల్యాణ్ కు సాంగ్స్ ఉండవా..? ఓ సాంగ్ ఉంది. కాకపోతే అది పవన్ పై వచ్చే సోలో సాంగ్ మాత్రమే. అది డ్యూయట్ కాదు. ఈ సినిమాలో పవన్ భగవంతుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Tags:    
Advertisement

Similar News